Viral News: నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి.. | Man Finds Wife Married His Brother Kills 7 Month Old Girl ABK
Share News

Viral News: నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి..

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:24 PM

బిహార్‌లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ రాక్షసుడు అన్నెం పున్నెం ఎరుగని ఏడు నెలల చిన్నారని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇందుకు కారణం.. భార్య తన తమ్ముడిని పెళ్లి చేసుకోవడమే. తాను జైల్లో ఉన్నప్పుడు భార్య తమ్ముడ్ని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనివ్వడంతో..

Viral News: నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి..
Man Finds Wife Married His Brother

బిహార్‌లో (Bihar) ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ రాక్షసుడు అన్నెం పున్నెం ఎరుగని ఏడు నెలల చిన్నారని అత్యంత క్రూరంగా చంపేశాడు. ఇందుకు కారణం.. భార్య తన తమ్ముడిని పెళ్లి చేసుకోవడమే. తాను జైల్లో ఉన్నప్పుడు భార్య తమ్ముడ్ని పెళ్లి చేసుకొని ఓ పాపకు జన్మనివ్వడంతో.. కోపంలో అతడు ఆ చిన్నారిని హతమార్చాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

బాబోయ్ ఇదేం మేనిఫెస్టో.. రగిలిపోతున్న వైసీపీ కేడర్!!

ఆ నిందితుడి పేరు విజయ్ సహాని (30). చైన్ స్నాచింగ్ కేసుల్లో అతడు గత నాలుగేళ్లుగా గురుగ్రామ్‌లోని భోండ్సీ జైల్లో ఉన్నాడు. ఈ గ్యాప్‌లో విజయ్ భార్య అతని తమ్ముడినే పెళ్లి చేసుకుంది. ఓ పాపకు కూడా జన్మనిచ్చింది. కట్ చేస్తే.. ఏప్రిల్ 24వ తేదీన విజయ్ జైలు నుంచి విడుదల అయ్యాడు. అక్కడి నుంచి నేరుగా ఇంటికెళ్లాడు. అప్పుడే అతనికి దిమ్మతిరిగే ఓ నిజం తెలిసింది. తన తమ్ముడినే భార్య పెళ్లి చేసుకుందని తెలిసి అతడు ఖంగుతిన్నాడు. దీంతో.. విజయ్ తన భార్యతో గొడవపడ్డాడు. అనంతరం కోపాద్రిక్తుడైన విజయ్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏడు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి, నేలకేసి కొట్టి చంపేశాడు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడు.

2 పేజీలు, 9 హామీలతో వైసీపీ మేనిఫెస్టో.. ఇంతకీ అందులో ఏమున్నాయ్!?

శుక్రవారం ఉదయం బాలిక అపస్మారక స్థితిలో ఉండటం చూసి తల్లి కన్నీరుమున్నీరైంది. పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు సంఘటనా స్థలానికి చేరుకొని, చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆ పసికందు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న విజయ్‌ని పట్టుకోవడం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాపం.. ఏ పాపం ఎరుగని ఓ చిన్నారి పెద్దలు చేసిన తప్పుకి బలైపోయింది.

Read Latest Crime News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 03:29 PM