Online games: ‘కొంప’ ముంచిన ఆన్‌లైన్ గేమ్స్..
ABN , Publish Date - May 01 , 2024 | 02:08 PM
ఆన్‌లైన్ గేమ్స్(Online games)కు బానిసలైన విద్యార్థులు భారీగా ఇంట్లోని నగదు, బంగారు చోరీలకు పాల్పడడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది.
- ఇంట్లో చోరీలకు పాల్పడిన బాలురు
- తల్లిదండ్రుల ఫిర్యాదుతో బట్టబయలు
- భారీగా నగదు, నగలు స్వాధీనం
బెంగళూరు: ఆన్‌లైన్ గేమ్స్(Online games)కు బానిసలైన విద్యార్థులు భారీగా ఇంట్లోని నగదు, బంగారు చోరీలకు పాల్పడడం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. బుధవారం విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ దయానంద్(City Police Commissioner Dayanand) తెలిసిన వివరాల మేరకు నగరంలోని ఆర్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐడియల్ హోమ్స్ నివాసి ఫిర్యాదు మేరకు పోలీసులు కార్యాచరణ నిర్వహించారు. తన కొడుకు, అతడి స్నేహితులు ఒకే తరగతి చదివేవారని ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై చోరీలకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లోని సుమారు 600కుపైగా గ్రాముల నగలు తన స్నేహితుడికి ఇచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: CM Revanth: తెలంగాణకు బీజేపీ ఏం ఇచ్చింది ‘గాడిద గుడ్డు’.. రేవంత్ ట్వీట్
కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరా తీశారు. నగలను పరిచయం ఉన్నవారికి ఇచ్చినట్లు బాలురు అంగీకరించారు. ఇందుకు సంబంధించి కొప్పళ జిల్లాలోని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా 10రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించారు. నిందితులనుంచి నగలను కరిగించిన 302 గ్రాముల బంగారం బిస్కట్‌లు, ఇతరత్రా సహా నగలను విక్రయించగా వచ్చిన రూ.23,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.41.50 లక్షలు ఉంటుందన్నారు. కేసును బెంగళూరు నగర పశ్చిమ విభాగం డీఎసీపీ గిరీశ్, బ్యాటరాయనపుర ఉపవిభాగం ఏసీపీ భరత్ ఎస్‌రెడ్డి నేతృత్వంలో రాజరాజేశ్వరినగర్ పోలీసులు కేసు చేధించారని కమిషనర్ వెల్లడించారు.
ఇదికూడా చదవండి: TS High Court: కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు నోటీసులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News