Share News

Secunderabad: రైల్వే స్టేషన్‌లో బంగారు ఆభరణాలు స్వాధీనం..

ABN , Publish Date - May 25 , 2024 | 11:12 AM

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station)లో ఓ నగల వ్యాపారి నుంచి రూ.13.16లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు సికింద్రాబాద్‌ జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Secunderabad: రైల్వే స్టేషన్‌లో బంగారు ఆభరణాలు స్వాధీనం..

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad Railway Station)లో ఓ నగల వ్యాపారి నుంచి రూ.13.16లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు సికింద్రాబాద్‌ జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే డీఎస్పీ జావేద్‌, జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ సాయి ఈశ్వర్‌గౌడ్‌, ఇన్‌స్పెక్టర్‌ సరస్వత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే అదనపు డీజీపీ మహేష్‌ భగవత్‌, సికింద్రాబాద్‌ రైల్వే ఎస్పీ సలీమా ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ సీఐ సరస్వత్‌తో పాటు ఆర్పీఎఫ్‌ పోలీసులు, జీఆర్‌పీ పోలీసులు(GRP Police) సంయుక్తంగా జనరల్‌ చెకింగ్‌ చేస్తుండగా, ప్లాట్‌ ఫాం నెంబరు 4లో చార్మినార్‌కు చెందిన మనబ్‌ హుదాయత్‌(34)పై అనుమానంతో అతడి బ్యాగును తనిఖీ చేయగా, అందులో రూ.13.16లక్షల విలువ చేసే 188.80 బంగా రు ఆభరణాలు ఉండడంతో ఇతడిని జీఆర్‌పీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: భార్యను హత్య చేసిన భర్త.. ఘటన ఆలస్యంగా వెలుగులోకి


బంగారు ఆభరణాలపై ఆరా తీయగా హుదాయత్‌ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించినట్టు జీఆర్‌పీ సీఐ తెలిపారు. ఈ నగలను సికింద్రాబాద్‌ నుంచి గుంటూరుకు తీసుకెళ్తున్నట్టు విచారణలో తేలింది. ఎటువంటి దస్తావేజు లు లేకపోవడంతో ఐటీ అధికారులకు అప్పగించామని సీఐ తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 25 , 2024 | 11:12 AM