Share News

Srikalahasti: వైసీపీ నేత బుల్లెట్‌ జయశ్యామ్‌ అరెస్టు..

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:21 AM

వైసీపీ నేత, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు బుల్లెట్‌ జయశ్యామ్‌(Bullet Jayashyam)ను పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్‌ కేసులో ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించారు. శ్రీకాళహస్తి(Srikalahasti) పట్టణ శివార్లలోని రాజీవ్‌నగర్‌ వద్ద కొందరు వైసీపీ నాయకులు పిచ్చాటూరు రహదారికి ఆనుకుని ఉన్న పనస కాలువ భూమిని గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేశారు.

Srikalahasti: వైసీపీ నేత బుల్లెట్‌ జయశ్యామ్‌ అరెస్టు..

- చీటింగ్‌ కేసులో 14రోజులు రిమాండ్‌

శ్రీకాళహస్తి: వైసీపీ నేత, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు బుల్లెట్‌ జయశ్యామ్‌(Bullet Jayashyam)ను పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్‌ కేసులో ఆయనకు 14రోజుల రిమాండ్‌ విధించారు. శ్రీకాళహస్తి(Srikalahasti) పట్టణ శివార్లలోని రాజీవ్‌నగర్‌ వద్ద కొందరు వైసీపీ నాయకులు పిచ్చాటూరు రహదారికి ఆనుకుని ఉన్న పనస కాలువ భూమిని గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేశారు. ఆ స్థలాలను వాటాలుగా వేసుకుని అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో బుల్లెట్‌ జయశ్యామ్‌ తొట్టంబేడు మండలం శివనాథపురం రెవెన్యూ పరిధిలోని పనసకాల్వ భూమిని ఆక్రమించినట్లు బాహాటంగా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ వార్తను కూడా చదవండి: ఆయన చేసేవన్నీ జిమ్మిక్కులే..


ఈ యేడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పనసకాలువల భూమిలో అక్రమంగా నిర్మించిన 105 కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఇందులో కేవీబీపురం మండలం రాజులకండ్రిగకు చెందిన కేశవులు అనే వ్యక్తి బుల్లెట్‌ జయశ్యామ్‌కు రూ.6లక్షలు నగదు చెల్లించి స్థలం కొనుగోలు చేశాడు. ఆరు నెలల క్రితం అది కాలువ భూమిగా తేలడంతో అధికారులు అక్కడ కట్టడాలను కూల్చివేశారు. దాంతో బాధితుడు కేశవులు తన నగదు రూ.6లక్షలు తిరిగి ఇవ్వాలని జయశ్యామ్‌పై ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం బాధితుడు కేశవులు తనకు కాలువ స్థలాన్ని అమ్మి బుల్లెట్‌ జయశ్యామ్‌ అనే వ్యక్తి మోసానికి పాల్పడ్డాడని గట్టిగా నిలదీస్తే రూ.లక్ష నగదు ఇచ్చాడని...


ఆ తరువాత నెలలు గడుస్తున్నా మిగతా నగదుపై సమాధానం చెప్పడం లేదని తొట్టంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై చీటింగ్‌కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ కేసులో తొట్టంబేడు పోలీసులు బుల్లెట్‌ జయశ్యామ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అనంతరం కోర్టుకు హాజరుపరచడంతో 14రోజుల రిమాండ్‌ విధించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బుల్లెట్‌ జయశ్యామ్‌ తీరుపై పెద్దఎత్తున అభియోగాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఆయన బహిరంగంగా దౌర్జన్యాలకు పాల్పడటం దుమారం రేపింది.


రెండేళ్ల క్రితం పట్టణ నడిబొడ్డున ఎన్టీఆర్‌ కూడలిలో పాలసరఫరా సంఘం ఎన్నికల నామినేషన్‌ రోజున టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాలి చలపతినాయుడు కారుపై కాసిరాళ్లతో దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ప్రజలందరూ చూస్తుండగానే చలపతినాయుడును కారు నుంచి బయటకులాగి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇక పాలకమండలి సభ్యుడుగా ముక్కంటి ఆలయంలో పలువురు అధికారులపై బూతులతో రెచ్చిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.


ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు

ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..

ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 28 , 2024 | 11:21 AM