Home » Srikalahasti
గుర్తు తెలియని వ్యక్తిని హతమార్చి ఇసుకలో పూడ్చిపెట్టిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. తొట్టంబేడు ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపిన వివరాలు... తొట్టంబేడు మండలం శివనాథపురం పరిధిలోని రాజీవ్‌నగర్(Rajivnagar)లో పలు నిర్మాణాలు వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్నాయి.
శ్రీకాళహస్తీ శ్వరాలయ మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభంకాను న్నాయి.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం 300 ఏళ్ల నాటి పగడ చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. ఆ సమయానికి భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తీశ్వరాలయం(Srikalahasti Temple)లోని రాయలవారి మండపం పక్కనే పగడ చెట్టు ఉంది. ప్రస్తుతం రాయలవారి మండపంలో రూ.500 రాహుకేతు పూజలను జరిపిస్తుంటారు.
వైసీపీ నేత, ముక్కంటి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు బుల్లెట్ జయశ్యామ్(Bullet Jayashyam)ను పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్ కేసులో ఆయనకు 14రోజుల రిమాండ్ విధించారు. శ్రీకాళహస్తి(Srikalahasti) పట్టణ శివార్లలోని రాజీవ్‌నగర్ వద్ద కొందరు వైసీపీ నాయకులు పిచ్చాటూరు రహదారికి ఆనుకుని ఉన్న పనస కాలువ భూమిని గత ప్రభుత్వ హయాంలో కబ్జా చేశారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డిపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది.
కార్తీక మాసం అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో శనివారం సాయంత్రం స్వర్ణమ్మకు హారతుల సమర్పణ వేడుకగా జరిగింది.
వైసీపీ అక్రమార్కులను త్వరలోనే జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి(MLA Bojjala Sudheer Reddy) అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ప్రజాసమస్యల పరిష్కారం కోసం మండలాల వారీగా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ల జాబితాను విడుదల చేసిన ఆయన.. మీడియాతో మాట్లాడారు.
ఆటో డైవ్రర్(Auto Diverter) కత్తితో విచక్షణా రహితంగా రెచ్చిపోయాడు. వేకువ జామున 4 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికెళ్లి హత్యాయత్నానికి తెగబడ్డాడు. అడ్డుకున్న అతడి భార్య, మామనూ గాయపరిచాడు. రక్తం కారుతుండగా ముగ్గురూ పోలీసు స్టేషనుకు పరుగు తీశారు. తెల్లారేసరికి పట్టణ ప్రధాన రహదారిలో కనిపించిన రక్తపు మరకలతో శ్రీకాళహస్తి(Srikalahasti)లో కలకలం రేగింది.
‘అనవసరంగా చెడ్డపేరు వస్తోంది. ఎమ్మెల్యేగా ఎందుకయ్యామా అని బాధేస్తోంది’ అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి వాపోయారు.
శ్రీకాళహస్తిలో ఈసారి సీన్ రివర్సవుతోంది. ఒకసారి ఓటమి సానుభూతి.. వైసీపీ వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదన్‌రెడ్డికి ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. విపరీతమైన అవినీతి ఆరోపణలున్నాయి. నిత్య వివాదాస్పద నేతగా ముద్ర వేసుకున్నారు.