Tirupati: తిరుపతిలో కలకలం.. ప్రియుడ్ని కిడ్నాప్ చేయించింది..
ABN , Publish Date - Nov 29 , 2024 | 11:12 AM
తనను సరిగా చూడటం లేదని ప్రియురాలే ప్రియుడ్ని కిడ్నాప్(Kidnapping) చేయించింది. ఈ ఘటన గురువారం తిరుపతి(Tirupati)లో కలకలం రేపింది. గంట వ్యవధిలోనే పోలీసులు నిందితులు, బాధితుడిని పట్టుకోగలిగారు.
- గంట వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు
తిరుపతి: తనను సరిగా చూడటం లేదని ప్రియురాలే ప్రియుడ్ని కిడ్నాప్(Kidnapping) చేయించింది. ఈ ఘటన గురువారం తిరుపతి(Tirupati)లో కలకలం రేపింది. గంట వ్యవధిలోనే పోలీసులు నిందితులు, బాధితుడిని పట్టుకోగలిగారు. తిరుపతి ఈస్ట్ సీఐ రామకృష్ణ(Tirupati East CI Ramakrishna) తెలిపిన ప్రకారం.. చిత్తూరు జిల్లా పెనుమూరుకు చెందిన నాని తిరుపతి పెద్దకాపులేఅవుట్‌లో ఒక లాడ్జిని లీజుకు తీసుకున్నారు. ఇతడికి వివాహం కాలేదు. ఈ క్రమంలో మదనపల్లెకు చెందిన భాను.. భర్త చనిపోవడంతో తిరుపతికి వచ్చి చిన్నచిన్న పనులు చేసుకుంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: MP Kanimozhi: ఆ జాలర్లను విడిపించండి..
ఈమె ఏడాద కిందట భానుకు పరిచయమైంది. వీరిద్దరూ కలిసి పెద్దకాపు లేఅవుట్‌లో ఉంటున్నారు. మూడు నెలలుగా తనను సరిగా పట్టించుకోక పోవడంతో ఆగ్రహించిన భాను.. మదనపల్లె నుంచి నలుగురు రౌడీలను రప్పించింది. లాడ్జిలో ఉన్న నానిని కిడ్నాప్ చేయించి మదనపల్లెకు తీసుకెళుతున్నారు. వాహనంలో అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు సమాచారం. కిడ్నాప్ సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ వెంకటనారాయణ, సీఐ రామకృష్ణ, రక్షక్ బృందాలను ఎస్పీ సుబ్బరాయుడు అప్రమత్తం చేశారు.
నాని మొబైల్ నెంబరు ఆధారంగా వాహనాన్ని గుర్తించారు. వాయల్పాడు వద్ద ప్రత్యేక బృందాలు వాహనం ఆపి కిడ్నాపర్లతో పాటు నానిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తీసుకొస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కిడ్నాపర్లను, బాధితుడ్ని విచారించి జరిగిన ఘటనపై దర్యాప్తు చేయనున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..
ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!
ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్ ఫ్యాక్టరీ పూర్తి
ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్, కేటీఆర్‌లది నా స్థాయి కాదు
Read Latest Telangana News and National News