Share News

Vijayawada: క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు.. యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు మృతి

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:04 AM

క్రికెట్‌ ఆడుతుండగా ఓ యువకుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. బుధవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు(Angaluru)లో ఈ విషాదం చోటుచేసుకుంది.

Vijayawada: క్రికెట్‌ ఆడుతుండగా గుండెపోటు.. యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు మృతి

- గుడ్లవల్లేరులో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు మృతి

- క్రిస్మస్‌ సెలవులకు హైదరాబాద్‌ నుంచి ఇంటికి..

గుడ్లవల్లేరు(విజయవాడ): క్రికెట్‌ ఆడుతుండగా ఓ యువకుడు గుండెపోటుకు గురై మృతి చెందాడు. బుధవారం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరు(Angaluru)లో ఈ విషాదం చోటుచేసుకుంది. అంగలూరుకు చెందిన కొమ్మాలపాటి సాయి (26) హైదారాబాద్‌(Hyderabad)లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. క్రిస్మస్‌ సెలవులకు రెండురోజుల క్రితం ఇంటికొచ్చాడు. బుధవారం కౌతవరంలో యువకులు క్రికెట్‌ ఆడుతుండగా అక్కడికి వెళ్లాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: యువతిపై ప్రేమోన్మాది దాడి..


city2.jpg

సాయి బౌలింగ్‌ చేస్తుండగా, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పి కొద్దిసేపు కూర్చుండిపోయాడు. తిరిగి బౌలింగ్‌ చేస్తూ హఠాత్తుగా కిందపడిపోయాడు. తోటి యువకులు సాయిని గుడివాడ(Gudiwada)లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. సాయి తండ్రి ప్రసాద్‌ ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన కుమారుడి హఠాన్మరణంతో కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 08:04 AM