Black Clothes: నలుపు రంగు దుస్తులంటే చాలా ఇష్టమా.. ఈ రోజుల్లో మాత్రం పొరపాటున కూడా ధరించకండి..
ABN , Publish Date - Oct 29 , 2024 | 10:51 AM
నలుపు రంగు అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది. కొందరు నమ్మకాల కారణంగా నలుపుకు దూరంగా ఉంటారు. మరికొందరు మాత్రం నలుపును ఇష్టంగా ధరిస్తారు. అయితే నలుపు రంగును కొన్ని రోజులలో ధరించకూడదు.
ఎవరైనా కాస్త నలుపు రంగులో ఉంటే ఎగతాళి చేసేవారికి చెంప పెట్టులా ఉంటుందని "నలుపు నారాయణుడిని మించు" అని సామెత చెబుతుంటారు. అయితే శరీర రంగు ఇలా ఉంటే దానికి ఎవరూ బాధ్యులు కాదు.. కానీ చాలామందికి నలుపు రంగు అన్నా, నలుపు రంగు దుస్తులు అన్నా చాలా ఇష్టం. దానికి తగినట్టుగానే మార్కెట్లో కూడా నలుపు రంగులో బోలెడు మోడల్స్ లో దుస్తులు అందుబాటులో ఉంటాయి. పార్టీలలోనూ, ఫంక్షన్లలోనూ నలుపు రంగు దుస్తులు ధరించిన వారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటారు. నలుపు రంగు ఇష్టపడేవారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆలోచనల పట్ల స్పష్టత ఎక్కువ అని అంటుంటారు. అయితే నలుపు రంగు దుస్తులంటే ఎంత ఇష్టమున్నా కొన్ని రోజుల్లో మాత్రం వీటిని అస్సలు ధరించకూడదని పెద్దలు అంటున్నారు.
Weight Loss: ఈ 6 టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. కిలోల కొద్ది బరువు ఈజీగా తగ్గుతారు..
హిందూ సంప్రదాయంలో చాలా విషయాలలో పట్టింపు ఉంటుంది. దుస్తుల నుండి దుస్తుల రంగు వరకు ప్రతి దానికి ప్రత్యేక కారణం, ప్రాధాన్యత ఉన్నాయి. ముఖ్యంగా వీటి మీద భారతీయులకు ఉన్న నమ్మకం చాలా పెద్ది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పూజలు, కార్యక్రమాల సందర్భంగా నలుపు రంగు ధరించడం దగ్గర చాలా నమ్మకాలు, కారణాలు ఉన్నాయి.
రోజువారి సమయాలలో నలుపు రంగు దుస్తులు ధరించే దగ్గర కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. సోమవారం, మంగళవారం నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించకూడదని అంటున్నారు. నలుపు రంగు దుస్తులు కానీ, దట్టమైన రంగులు కలిగిన ఇతర రంగులు ప్రతికూల వాతావరణాన్ని అట్రాక్షన్ చేస్తాయట. ప్రతికూలతను సృష్టిస్తాయట. అందుకే ఈ రంగు దుస్తులను ధరించకూడదని అంటున్నారు.
Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది.. కొలెస్ట్రాల్ ఎంత ఉంటే సేఫ్ గా పరిగణిస్తారంటే..
శివుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారం కానీ, హనుమంతుడికి ప్రతీకరమైన మంగళవారం కానీ నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదట. ముఖ్యంగా నలుపు రంగు అంటే చీకటి, రాత్రి, మరణాలు మొదలైనవాటితో సంబంధం కలిగి ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగా నలుపు రంగును శుభకార్యాలలోనే కాదు.. సోమ, మంగళ వారాలలో కూడా ధరించకూడదు.
హేతుబద్దంగా చెప్పాలంటే.. నలుపు రంగు దేన్నైనా చాలా తొందరగా ఆకర్షించగలుగుతుంది. తొందరగా స్పందిస్తుంది. అదే విధంగా వేడిని కూడా గ్రహిస్తుంది. ఈ కారణంగా నలుపు రంగు శరీరం మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. తొందరగా అనారోగ్యానికి గురి కావడం, మానసికంగా ఇబ్బంది పడటం వంటివి జరుగుతాయి.
ఇవి కూడా చదవండి..
Vitamin-D: విటమిన్-డి సప్లిమెంట్లను రోజూ తీసుకున్నా కొందరికి పనిచేయవు ఎందుకని..
Skin Care: నారింజ తొక్కలు ఇలా వాడితే.. మచ్చలు లేని చర్మం గ్యారెంటీ..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.