Tirumala: భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. ఇవాళ దర్శనానికి వెళ్లే వారికి గుడ్ న్యూస్..
ABN , Publish Date - Mar 19 , 2024 | 07:17 AM
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వీక్ డేస్‌తో పాటు పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో జనాభా భారీగా తగ్గుముఖం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనానికి అనుమతి లభిస్తోంది.
తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వీక్ డేస్‌తో పాటు పిల్లలకు పరీక్షలు జరుగుతుండటంతో భక్తులు గణనీయంగా తగ్గిపోయారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vykuntam Queue Complex)లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగానే శ్రీవారి దర్శనానికి అనుమతి లభిస్తోంది. నిన్న శ్రీవారిని 65,051 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. స్వామివారికి 23,107 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.