Home » Vinayaka Chaviti
ఆ లడ్డూ వేలం పాటలో లక్ష.. పది లక్షలు.. యాభై లక్షలు.. ఆపై కోటి కూడా దాటేస్తే అంతా నోరేళ్లబెట్టారు. అక్కడితో పాట ఆగితేనా? జోరుగా సాగుతుంటే రెండు కోట్లకు చేరుతుందా? అనిపించింది. అయితే చివరికి రూ.1.87 కోట్లు పలికింది.
న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 10: పటిష్టమైన బందోబస్తు నడుమ గణేష్ నిమజ్జనాలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోస్టల్ సెక్యూరిటీ సూప
విఘ్నాలు తొలగించాలంటూ గల్ఫ్ దేశాల్లోని వేలాది మంది తెలుగు ప్రవాసీయులు వినాయకుడిని పూజిస్తూ వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారు.
దేశ వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. గణపతి వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ తొలి పూజలు అందుకున్నారు.
మహారాష్ట్రలో గణేష్ చతుర్ధి ఉత్సవాలు వైభవంగా శనివారం మొదలయ్యాయి. గణేష్ ప్రతిమలతో మండపాల్లోనూ, ఇళ్లలోనూ వినాయకుడు కొలువుతీరుతున్నాడు. వినాయకుడికి స్వాగతం పలుకుతూ మండపాలను రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు సందర్శిస్తూ సందడి చేస్తున్నారు.
దేశవిదేశాల్లో ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభించి ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల మూర్తిని శిల్పులు సిద్ధం చేశారు. సప్త ముఖాల్లో ఓవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరోవైపు సరస్వతి, లక్ష్మి, పార్వతుల మధ్య గణపతి ఉండేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు.
ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్య ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మా ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మార్కులెన్నో వచ్చి మేలుగా పాసైతే కోర్కె తీరా నిన్ను కొలిచేమయ్యా మేళతాళాలు మారు మోగేటట్లు ఉత్సవాలెన్నెన్నో చేసేమయ్యా పోయినసారి మరీ పదమూడే వచ్చాయి
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.
విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి. వాటిని ఒక్కొక్క పురాణం ఒక విధంగా వర్ణించింది. వాటిలో వరాహపురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా ఉంది. ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుంచి జన్మించినట్టు చెప్పింది. రాక్షసుల బాఽధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పమని ఋషులు, దేవతలు శివుడిని అడిగారు.