Home » Ganesh Chaturthi
Ganesh Immersion 2024: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణేష్ శోభా యాత్ర కొనసాగుతోంది. అర్ధ రాత్రి తర్వాత కలశ పూజ అనంతరం ఖైరతాబాద్ గణేశుడు భారీ ట్రాలీపైకి ఎక్కాడు. మొత్తం రెండున్నర కిలో మీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర కొనసాగనుంది. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో ఏర్పాటైన మట్టి గణేష్ విశిష్ఠ పూజలు అందుకున్నాడు.
దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ముగిశాయి. నిమజ్జనంలో భాగంగా వినాయకుడు.. గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం కోసం వెళ్తున్న ఊరేగింపుపై ఓ వర్గం రాళ్ల దాడికి దిగింది. దీంతో ఊరేగింపులో పాల్గొన్న భక్తులు సైతం ఎదురు దాడికి దిగారు. దాంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి.
బాలాపూర్ గణపతి లడ్డూ(Balapur Ganapati Ladoo) వేలానికి ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తయ్యాయి. బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 1980లో ఉత్సవాలు ప్రారంభం కాగా, వేలం మాత్రం 1994లో మొదలైంది.
ఆ లడ్డూ వేలం పాటలో లక్ష.. పది లక్షలు.. యాభై లక్షలు.. ఆపై కోటి కూడా దాటేస్తే అంతా నోరేళ్లబెట్టారు. అక్కడితో పాట ఆగితేనా? జోరుగా సాగుతుంటే రెండు కోట్లకు చేరుతుందా? అనిపించింది. అయితే చివరికి రూ.1.87 కోట్లు పలికింది.
‘గణేశ్ మహరాజ్ కీ జై’.. ‘గణపతి బొప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ’ అంటూ మేళతాళాలు, నృత్యాల మధ్య ఉప్పొంగిన భక్తిభావంతో కూడిన నినాదాలతో పెద్ద సంఖ్య లో భక్తులు గణనాథుడికి వీడ్కోలు పలికారు.
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కీర్తి రిచ్మండ్ విల్లాస్‌లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో లడ్డూ రూ.1.87కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది.
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు.
ఎప్పుడో.. 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేశ్ మండపం వద్ద సరదాగా మొదలైన లడ్డూ వేలం పాట ఇప్పుడో ట్రెండ్!
గణేశుడి నిమజ్జనం వేళ ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. సిటీ నలుమూలల నుంచి వస్తున్న వినాయకులతో రోడ్లపై భారీ రద్దీ నెలకొంది. ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ఖైరతాబాద్ మహాగణపతి హుండీలో విరాళాల వర్షం కురిసింది. ఎన్నడూ లేనంత స్థాయిలో భారీగా హుండీ ఆదాయం వచ్చి చేరింది. కేవలం హుండీ కానుకల ద్వారానే 70 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు.