Share News

Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..

ABN , Publish Date - Sep 04 , 2024 | 05:16 PM

ఇటీవల కాలంలో పర్వదినాలన్నీ ఒక రోజు మధ్యాహ్నం ప్రారంభమై.. మరునాడు సాయంత్రం వరకు ఉంటుంది. దీంతో ఒక రోజు మిగులు తగులు ఉంటుంది. అలాంటి వేళ.. పండగ ఏ రోజు జరుపుకోవాలంటూ భక్తుల్లో ఓ మీమాసం అయితే మొదలవుతుంది.

Vinayaka Chavithi Special 2024: ఇంతకీ పండగ శుక్రవారమా? లేక శనివారమా?.. పండితులు ఏం చెబుతున్నారంటే?..

ఇటీవల కాలంలో పర్వదినాలన్నీ ఒక రోజు మధ్యాహ్నం ప్రారంభమై.. మరునాడు సాయంత్రం వరకు ఉంటుంది. దీంతో ఒక రోజు మిగులు తగులు ఉంటుంది. అలాంటి వేళ.. పండగ ఏ రోజు జరుపుకోవాలంటూ భక్తుల్లో ఓ మీమాసం అయితే మొదలవుతుంది. దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. తాజాగా భద్రపద శుద్ద చతుర్థి అంటే వినాయక చవితి పర్వదినం ఏ రోజు జరుపుకోవాలనే కొన్ని సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అలాంటి వేళ.. పంచాంగ కర్తలు ఏం చెబుతున్నారంటే..


vinayaka-111.jpg

వినాయక చవితి ఎప్పుడు?

తెలుగు పంచాంగం ప్రకారం చతుర్థి తిథి సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభమవుతుంది. 2024, సెప్టెంబర్ 7వ తేదీ శనివారం సాయంత్రం 5:35 గంటల వరకు ఆ తిథి కొనసాగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం మొదలు ఏ తిథి ఉంటే.. అదే రోజు పండుగ నిర్వహించుకోవడం పురాతనంగా ఓ ఆనవాయితీ అయితే కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7వ తేదీ అంటే శనివారం వినాయక చవితి జరుపుకోవాలని పంచాంగ కర్తలు స్పష్టం చేస్తున్నారు. ఆ రోజు ఉదయం 1.03 గంటల నుంచి మధ్యాహ్నం 1.34 గంటల వరకు శుభ సమయం ఉందని వారు పేర్కొంటున్నారు.


vinayakudu-222.jpg

వినాయకుడిని ఎందుకు పూజిస్తారు?

భాద్రపద మాసం. శుద్ధ చవితి రోజు వినాయకునికి పరమశివుడు గణాధిపత్యం ఒసంగిన రోజు. ఆ రోజు తాము చేసే పనిలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని ప్రతి ఒక్కరు భావిస్తారు. అలాంటి వేళ.. ప్రతి ఒక్కరూ గణపతిని ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలోనే వినాయకుడిని విఘ్ననాయకుడిగా పేర్కొంటారు. అతి చిన్న పూజ నుంచి యాగం వరకు ఏ పూజ చేసినా.. ముందుగా గణపతిని పూజించడం సనాతన సంప్రదాయంగా ఆది కాలం నుంచి వస్తుంది. గణపతిని పూజించకుండా ఏ పనిని ఎవరు మొదలు పెట్టరన్న సంగతి అందరికి తెలిసిందే. అందుకు అన్ని పూజల్లో అందరు దేవుళ్లలో విఘ్నశ్వరుడికి అగ్ర తాంబులమిస్తారన్న విషయం విధితమే.


ఇవి కూడా చదవండి..

Vinayaka Chavithi Special 2024: పండగ రోజు విద్యార్థులు ఇలా చేస్తే మాత్రం వారికి తిరుగే ఉండదు..

Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..

Ganesh Chaturthi 2024: లంబోదరుడి పూజలో 21 రకాల ఆకుల ప్రత్యేకత.. నిమజ్జనం ఎందుకు చేస్తారు


Vinayaka Chavithi 2024: వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టాపనకు శుభ సమయం ఎప్పుడంటే..


Ganesh Chaturthi: వినాయకుడి వ్రత కథ.. వింటే కోటి జన్మల పుణ్యం

Ganesh Chaturthi: వినాయక చవితికి ఎలాంటి విగ్రహాన్ని పూజలో ఉంచితే మంచిది? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి?

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 04 , 2024 | 05:47 PM