Share News

karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:09 PM

కార్తీక మాసంలో చేసే ప్రతి పనికి అంతర్లీనంగా ఒక ఆరోగ్య ఫలితం ఉంటుంది. అందులో ఉపవాసం ఒకటి. ఈ నెలలో ఇష్టదైవం పేరిట ఉపవాసం ఉండడం మంచిది. ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ సైతం స్పష్టం చేస్తుంది. పగలంతా ఉపవాసం చేసి.. రాత్రి భోజనం చేయాలని ఓ నియమం సైతం ఉంది. పగలంతా ఆహారం లేకుండా ఉండేవాళ్లు పాలు, పండ్లు తీసుకోవచ్చు.

karthika pournami: కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..

మాసాల్లో కార్తీక మాసం సర్వ శ్రేష్టం. ఈ మాసంలో శివారాధాన చేస్తూ.. ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేష ఫలితం ఉంటుంది. ఇక కార్తీక పౌర్ణమి రోజు.. శివ కేశవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ పౌర్ణమి రోజు నదీ, సముద్ర స్నానాలు చేసి.. సమీపంలోని దేవాలయంలో అమ్మవార్లను కానీ అయ్యవార్లను కానీ దర్శించుకునే వారికి విశేష ఫలితం సంప్రాప్తిస్తుందని శాస్త్రపండితులు చెబుతున్నారు.

Also Read: వైసీపీ సోషల్ మీడియా సైకోలపై వైఎస్ సునీత ఫిర్యాదు


కార్తీక పౌర్ణమి ఎప్పుడు..?

ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నవంబర్ 15వ తేదీన వచ్చింది. ఆ రోజు ఉదయం 6:31 గంటలకు పూర్ణిమ తిథి ప్రారంభమవుతుంది. ఈ తిథి 16వ తేదీ తెల్లవారుజామున 3:02 గంటలకు ముగియనుంది. ఇక ఆ రోజు పూజ చేసేందుకు భక్తులకు శుభ సమయం ఉదయం 8:46 గంటల నుంచి 10:26 గంటల వరకు ఉంటుంది. ఇక స్నానాధికాలకు ఉదయం 6:28 గంటల నుంచి 7:19 గంటల వరకు ఉందని అంటున్నారు.

Also Read: గాడిద పాలు తాగితే ఇన్ని లాభాలున్నాయా..?


ఈ ఏడాది కార్తీక పూర్ణిమ ప్రత్యేకత ఏమంటే..?

ఈ ఏడాది కార్తీక పూర్ణిమ రోజు.. గజకేసరి రాజయోగం ఏర్పడుతుందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు. అనంతరం శష రాజయోగం సైతం ఏర్పడుతుందని వివరిస్తు్న్నారు. దీంతో ఆ రోజు శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. ఈ రోజు దీపాలు వెలిగించడం, దీపం దానం చేయడం చాలా పుణ్య ఫలమని అగ్నిపురాణంలో పేర్కొన్నారు. కార్తీక మాసంలో దీపం వెలిగించని వాళ్ళు.. ఒక్క పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు.

Also Read: Hyderabad: హోటళ్లలో అధికారులు తనిఖీలు.. విస్తుపోయే నిజాలు


కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలి..?

  • ఉదయాన్నే నిద్ర లేచి పవిత్ర నదిలో స్నానం చేయాలి.

  • శివుడు, మహా విష్ణువు, లక్ష్మీదేవిని పూజించాలి.

  • నదిలో దీపాలను దానం చేయండి. కుదరకపోతే ఆలయంలో దీపాన్ని దానం చేయండి.

  • విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం సర్వదా శ్రేయస్కరం.

  • చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి అర్ఘ్యంగా సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు.

  • ఆవును దానం చేయడం సైతం పుణ్యంగా భావిస్తారు.

  • పేదవారికి ఆహారం, బెల్లం, దుస్తులు దానం చేయడం శుభఫలితాలు అందుకుంటారు.


కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయకూడదు..?

  • ఈ రోజు.. వెండి పాత్రలు లేదా పాలను ఎట్టి పరిస్థితుల్లో దానంగా ఇవ్వకూడదు.

  • ఈ మాసంలో అత్యంత పవిత్రమైన ఈ రోజు.. ఇంట్లోని ఏ గదిని చీకటిగా ఉంచకూడదు. దీపాలు వెలుగుతూ ఉండాలి.

  • మాంసాహరం తీసుకోవడం ఇంటికి అరిష్టంగా భావిస్తారు.

  • పెద్దలను అవమానించడం, అసభ్య పదజాలం వాడ కూడదు.

  • ఇంటి ముందుకు వచ్చిన పేదలు, నిస్సహాయులు, బిక్షగాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వట్టి ఖాళీ చేతులతో పంపించకూడదు. మీ శక్తి మేరకు ఆహారాన్ని కానీ.. ధనాన్ని కానీ లేదా ధ్యాన్యాన్ని కానీ దానం చేయడం శుభప్రదం.


పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే..

ఈ మాసంలో చేసే ప్రతి పనికి అంతర్లీనంగా ఒక ఆరోగ్య ఫలితం ఉంటుంది. అందులో ఉపవాసం ఒకటి. ఈ నెలలో ఇష్టదైవం పేరిట ఉపవాసం ఉండడం మంచిది. ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ సైతం స్పష్టం చేస్తుంది. పగలంతా ఉపవాసం చేసి.. రాత్రి భోజనం చేయాలని ఓ నియమం సైతం ఉంది. పగలంతా ఆహారం లేకుండా ఉండేవాళ్లు పాలు, పండ్లు తీసుకోవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలతోపాటు తెలుగు వార్తల కోసం..

Updated Date - Nov 13 , 2024 | 05:09 PM