Share News

‘ఎయిడెడ్’ను కాపాడండి!

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:47 AM

రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు క్రమంగా మూతపడుతున్నాయి. అనేక ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పదవీవిరమణలు మాత్రమే ఉంటున్నాయి తప్ప, కొత్త ఉపాధ్యాయుల భర్తీ లేదు. పోస్టులను

‘ఎయిడెడ్’ను కాపాడండి!

రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు క్రమంగా మూతపడుతున్నాయి. అనేక ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పదవీవిరమణలు మాత్రమే ఉంటున్నాయి తప్ప, కొత్త ఉపాధ్యాయుల భర్తీ లేదు. పోస్టులను భర్తీ చేయకపోవడం వల్ల ఉపాధ్యాయుల కొరత ఏర్పడటంతో విద్యార్థులు పాఠశాలల్లో చేరడం లేదు. విద్యార్థులు లేరనే సాకుతో ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్నవారిని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విధుల నిర్వహణకు కేటాయిస్తున్నారు. దశాబ్దాల క్రితం ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు అనేకమంది నేడు ఉన్నతస్థానాలకు ఎదిగి సమాజానికి సేవలు అందిస్తున్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు దాతలు భారీగా భూదానాలు చేశారు. ఒక్కో పాఠశాలకు మూడు నుండి 10 ఎకరాల వరకూ భూమి కేటాయించారు. ప్రస్తుతం అనేక ఎయిడెడ్ విద్యాసంస్థల భూములు కబ్జాదారుల వశమైనాయి. కొన్ని భూములు రెండు, మూడు చేతులు మారితే, మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. కొన్ని చోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సదరు సంస్థల యాజమాన్యం వత్తాసుతో భూకబ్జాదారుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తులను, భూములను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటి స్థితిగతులను లోతుగా సమీక్షించి ఖాళీలను భర్తీ చేయాలి.

– ఎస్. విజయ భాస్కర్

Updated Date - Jul 06 , 2024 | 04:47 AM