Financial Crisis : అభివృద్ధి దిశగా అడుగులు!
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:25 AM
అసమర్థ పాలకుల నియంతృత్వ, మూర్ఖపు చర్యలతో గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అరాచకంతో అప్పుల పాలయింది. రాష్ట్ర భవిష్యత్తును కాచుకోవడమే లక్ష్యంగా విధ్వంస ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం.
అసమర్థ పాలకుల నియంతృత్వ, మూర్ఖపు చర్యలతో గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అరాచకంతో అప్పుల పాలయింది. రాష్ట్ర భవిష్యత్తును కాచుకోవడమే లక్ష్యంగా విధ్వంస ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలంబనలయ్యే పోలవరం, అమరావతి రాజధాని నగర నిర్మాణాలను పరుగులు తీయించడం సీఎం చంద్రబాబు దీక్షా దక్షతలకు అద్దం పడుతున్నది. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుతో రాష్ట్రాల్లో గణనీయమైన పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
ఆరు నెలల్లో 50కి పైగా జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు పెట్టుబడులతో వచ్చాయి. కేంద్రం నుంచి అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరానికి రూ. 12,500 కోట్లు సాధించడం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25 వేల కోట్ల పెట్టుబడులు సాధించడం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించడం వంటివి రాష్ట్రాభివృద్ధికి మేలు చేస్తాయి. అలాగే రూ.55 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులు రెండున్నరేళ్లలో పూర్తి చేయడానికి కేంద్రం అనుమతి సాధించడం, రూ.70 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం వంటి కార్యక్రమాలతో చక్కటి ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధిబాట పట్టించడానికి కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నది. కూటమి పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నది.
– నీరుకొండ ప్రసాద్