వంగపల్లి దీక్ష
ABN , Publish Date - Jul 06 , 2024 | 04:50 AM
ఎస్సీల వర్గీకరణ ఇంకా పరిష్కారం లభించని అంశంగానే ఉంది. న్యాయబద్ధత, సమాజ మద్దతూ ఉండి కూడా రాజకీయపార్టీల వైఖరివల్ల మాదిగ సమాజం మోసపోతూనే ఉంది. మొన్నటిమొన్న ప్రధానమంత్రి హోదాలో మోదీగారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇస్తే వర్గీకరణ
ఎస్సీల వర్గీకరణ ఇంకా పరిష్కారం లభించని అంశంగానే ఉంది. న్యాయబద్ధత, సమాజ మద్దతూ ఉండి కూడా రాజకీయపార్టీల వైఖరివల్ల మాదిగ సమాజం మోసపోతూనే ఉంది. మొన్నటిమొన్న ప్రధానమంత్రి హోదాలో మోదీగారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇస్తే వర్గీకరణ చేస్తారని ఆశపడ్డాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టలేదు. కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ పేరుతో మాదిగ ఓట్లకు గాలం వేశారు. ఈ నేపథ్యంలో, ఎస్సీల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా, ఎంఆర్‌పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 7న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద వర్గీకరణ సాధనకై రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ దీక్ష నిర్వహిస్తారు.