Share News

ఆ ఖాళీలనూ డీఎస్సీలో కలపాలి

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:45 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా ఏర్పడే 10వేల ఉపాధ్యాయ ఖాళీలను కూడా ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్‌లో జతచేయాలి. అలాగే టెట్ ఫలితాలకు, డీఎస్సీ పాత షెడ్యూల్ జూలై 17కి తక్కువ సమయం ఉంది.

ఆ ఖాళీలనూ డీఎస్సీలో కలపాలి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా ఏర్పడే 10వేల ఉపాధ్యాయ ఖాళీలను కూడా ప్రస్తుత డీఎస్సీ నోటిఫికేషన్‌లో జతచేయాలి. అలాగే టెట్ ఫలితాలకు, డీఎస్సీ పాత షెడ్యూల్ జూలై 17కి తక్కువ సమయం ఉంది. అందువల్ల అభ్యర్థులకు మరొక నెల రోజులు గడువు ఇచ్చి ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. దాంతో పెద్ద ఎత్తున డీఎస్సీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన 5089 టీచర్ పోస్టులకు, మరో 6 వేల టీచర్ పోస్టులు మాత్రమే జత చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. గత 8 సంవత్సరాలుగా టీచర్ పోస్టులు భర్తీ కాలేదు. 33 జిల్లాల వారీగా చూస్తే ఇప్పుడు వచ్చిన డీఎస్సీలో స్వల్ప సంఖ్యలోనే పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సింగిల్ డిజిట్‌లోనే ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు కూడా చాలా జిల్లాల్లో తక్కువ సంఖ్యలోనే ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పుడు చేపట్టిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కొత్తగా ఖాళీలు ఏర్పడనున్నాయి. హేతుబద్ధీకరణ అంటూ టీచర్ పోస్టులు కుదించకుండా ఈ ఖాళీలను కూడా ప్రస్తుత డీఎస్సీలో జతచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి. అప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద విద్యార్థులకు కూడా టీచర్లు అందుబాటులో ఉంటారు. ప్రభుత్వ స్కూల్స్ కూడా బలోపేతం అవుతాయి. అలాగే డీఎస్సీ పరీక్షలు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించాలి.

– రావుల రామ్మోహన్ రెడ్డి

డి.ఎడ్, బి.ఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ

Updated Date - Jul 06 , 2024 | 04:45 AM