Share News

Hyderabad: పీజీఈసెట్‌లో 91.28 శాతం ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 19 , 2024 | 09:13 AM

ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పీజీఈసెట్‌-2024 ఫలితాలు మంగళవారం సాయంత్రం వెలువడ్డాయి. 91.28 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 20,626 మంది పరీక్షకు హాజరవ్వగా వారిలో 18,829 మంది ఉత్తీర్ణులు అయ్యారు.

Hyderabad: పీజీఈసెట్‌లో 91.28 శాతం ఉత్తీర్ణత

- పరీక్ష నిర్వహించిన తర్వాత ఐదు రోజులకే ఫలితాల వెల్లడి

- సీఎస్ఈ విభాగంలో టాప్‌-3 స్థానాలు హైదరాబాదీలకే

- మెటలర్జీ, ఫార్మసీ టాపర్లు ఏపీ విద్యార్థులు

హైదరాబాద్‌ సిటీ: ఎంటెక్‌, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీజీ పీజీఈసెట్‌-2024 ఫలితాలు మంగళవారం సాయంత్రం వెలువడ్డాయి. 91.28 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 20,626 మంది పరీక్షకు హాజరవ్వగా వారిలో 18,829 మంది ఉత్తీర్ణులు అయ్యారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమలో రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది పీజీఈసెట్‌కు 22,712 మంది దరఖాస్తు చేసుకోగా జూన్‌ 10-13 తేదీల్లో మొత్తం 19 సబ్జెక్టులకు పరీక్షలు జరిగాయి. చివరి పరీక్ష ముగిసిన తర్వాత ఐదు రోజులకే ఫలితాలు ప్రకటించడం విశేషం.


కాగా, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, ఫుడ్‌ టెక్నాలజీ, మెటలర్జీ, టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ సబ్జెక్టుల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన మాజేటి అంజనీకుమార్‌, అన్నవరపు గౌరవ్‌ అవినాష్‌, జంగా మౌనిక వరుసగా తొలి మూడు ర్యాంకులు సాధించారు. ఈసీఈలో అకోజ్‌ దివ్య(జనగాం), ఈఈఈలో రమావత్‌ పవన్‌(నల్లగొండ) టాప్‌ ర్యాంకులు సాధించారు. మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ సబ్జెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ప్రఽథమ స్థానాల్లో నిలిచారు. మెటలర్జీలో ఏలూరుకు చెందిన షేక్‌ అస్మా, ఫార్మసీలో కడపకు చెందిన బసవరాజు వెంకట ప్రశస్తి టాపర్లుగా నిలిచారు. ఇతర ముఖ్యమైన సబ్జెక్టుల్లో రాష్ట్ర విద్యార్థులే సత్తా చాటారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 09:13 AM