Share News

Jobs: 9,995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేశారా..

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:14 PM

మీరు ప్రభుత్వ ఉద్యోగాల(jobs) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో 9,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Jobs: 9,995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లై చేశారా..
IBPS RRB 2024 notification 9995 jobs

మీరు ప్రభుత్వ ఉద్యోగాల(jobs) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో 9,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో స్టాఫ్ ఆఫీసర్ (స్కేల్-I, II, III), ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు రిక్రూట్‌మెంట్ వచ్చింది. ఈ పోస్టులకు జూన్ 7 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, చివరి తేదీ జూన్ 27గా ప్రకటించారు.


వయో పరిమితి

IBPS RRB పరీక్షకు వయోపరిమితి దరఖాస్తు చేసిన పోస్ట్‌ను బట్టి మారుతుంది. ఆఫీసర్ స్కేల్-III కోసం, అభ్యర్థి వయస్సు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంది. ఇక ఆఫీసర్ స్కేల్ II కోసం వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాలు. ఆఫీసర్ స్కేల్-I కోసం అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలని ప్రకటించారు.


దరఖాస్తు రుసుము

నోటిఫికేషన్ ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్, ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బి ఆఫీసర్స్ పరీక్షకు వేర్వేరు దరఖాస్తు ఫీజుగా మొత్తం రూ.850 చెల్లించాలి. కాగా, షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), వికలాంగులు (PWD) కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 175 రూపాయలు.

పరీక్ష ఎప్పుడు?

ఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు రెండు లేదా మూడు దశల ఎంపిక ప్రక్రియను ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే ముందుగా ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. IBPS RRB PO, క్లర్క్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష 03, 04, 10, 17, 18 ఆగస్టు 2024న షెడ్యూల్ చేయబడింది. మెయిన్స్ పరీక్ష వరుసగా సెప్టెంబర్ 29, అక్టోబర్ 06, 2024న నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. అర్హతలు ఆయా పోస్టులను భట్టి ఉంటాయి. పూర్తి నోటిఫికేష్ ఒకసారి క్షుణ్ణంగా చూసుకుని మీ అర్హతలను బట్టి ibps.in వెబ్‌సైట్ సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి.


ఇవి కూడా చదవండి..

Group 1 Prelims Exam: రేపే గ్రూప్ 1 ఎగ్జామ్..ఈ రూల్స్ అస్సలు మరువొద్దు

Ramoji Rao: రామోజీ రావు గురించి ఆసక్తికర విషయాలు

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

For More Education News and Telugu News..

Updated Date - Jun 08 , 2024 | 12:16 PM