PM Modi: రాజన్నకు ప్రధాని మోదీ కోడె మొక్కు
ABN , Publish Date - May 08 , 2024 | 10:56 AM
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు కోడె మొక్కును సమర్పించారు. గతంలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎవరూ కూడా కోడె మొక్కు అందించలేదు.
వేములవాడ: తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రత్యేక దృష్టి సారించారు. వరుస సభలు, సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఈ రోజు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు కోడె మొక్కును సమర్పించారు. గతంలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎవరూ కూడా కోడె మొక్కు అందించలేదు. ప్రధాని మోదీ అందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దక్షిణ భారతదేశంలో ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ. ఇక్కడ కొలువైన శివుడిని రాజరాజేశ్వరుడిగా భక్తులు కొలుస్తారు. ప్రతి సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపిస్తారు. రాజన్నకు తలనీలాలు సమర్పించడం, బంగారం (బెల్లం) తూకం వేస్తుంటారు. కోడె కట్టడం ముఖ్యమైన మొక్కు. ఆలయం ముందు కొన్ని ఆవులు ఉంటాయి. టికెట్ తీసుకొని, గుడి చుట్టూ ఆవుల చేత ప్రదిక్షణ చేస్తారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. హిందూ సంప్రాదాయం ప్రకారం గోవులకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే.
Read Latest Telangana News And Telugu News