Brain Tumor: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తే.. బ్రెయిన్ ట్యూమర్ ఉండే ఛాన్స్!
ABN , Publish Date - Jul 14 , 2024 | 07:59 PM
బ్రెయిన్ ట్యూమర్లు ఉన్న సందర్భాల్లో సీజర్లు, మతిమరుపు, విషయాల్ని అర్థం చేసుకోలేకపోవడం, అవయవాల కదలికల మధ్య సమన్వయలోపం వంటివి కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: బ్రెయిన్ ట్యూమర్లు అత్యంత ప్రమాదకరం. మెదడులో ఓ భాగంలో తలెత్తే ట్యూమర్ ఇతర ప్రాంతాలకు విస్తరిస్తుంది. మెదడుపై ఒత్తిడి పెంచుతుంది. కొన్ని బ్రెయిన్ ట్యూమర్లు చివరకు క్యాన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంది. మెదడులో ఫ్లూయిడ్ ప్రసరణకు ట్యూమర్లు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు మెదడులో ఒత్తడి పెరిగి రకరకాల సమస్యలు తలెత్తుతాయి. అయితే, ట్యూమర్‌కు సంబంధించిన లక్షణాలు (Health) తెలుసుకుని ముందుగానే గుర్తిస్తే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు (Signs of a possible Brain tumor).
Lancet: భారతీయులపై సంచలన అధ్యయనం.. దేశంలో సగానికిపైగా ప్రజల పరిస్థితి ఇదే!
బ్రెయిన్ ట్యూమర్ల వల్ల ఫిట్స్ రావచ్చు. ఇవి పూర్తిగా బహిర్గతం కాకపోవచ్చు. ఈ తరహా సీజర్ల వల్ల వాసన చూసే శక్తి, చూపు, వినికిడి లోపాలు తలెత్తొచ్చు
ట్యూమర్ల కారణంగా మెదడు శక్తి కూడా తగ్గుతుంది. విషయాలను అవగాహన చేసుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంది. ముఖ్యంగా మిడ్ బ్రెయిన్‌లో వచ్చే ట్యూమర్లు మెదుడలో సమాచార మార్పిడిని అడ్డుకుని ఈ తరహా సమస్యలకు దారి తీస్తాయి
ట్యూమర్ల కారణంగా మతిమరుపు కూడా వస్తుంది. కొన్ని సందర్భాల్లో అసాధారణ స్థాయిలో పెరుగుతుంది. పరిస్థితి తీవ్రంగా ఉందని భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
అవయవాల కదలికల మధ్య సమన్వయం లేకపోవడం కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు సంకేతంగా భావించాలని నిపుణుల చెబుతున్నారు. నడకలో తూలడం, చిన్న చిన్న పనులు చేయడంలో కూడా తడబాటు వంటివి ట్యూమర్‌కు సంకేతాలు
ట్యూమర్ల కారణంగా శరీరంలోని పలు భాగాల్లో నొప్పి అనిపిస్తుంది. పన్ను నొప్పి నుంచి కాలి నొప్పుల వరకూ ట్యూమర్ కారణం కావచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి, ఈ లక్షణాలు కనిపించినప్పుడు కంగారు పడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.