Share News

Health: ఈ 8 అలవాట్లు ఉంటే బ్రెయిన్ డ్యామేజ్ పక్కా!

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:32 PM

కొన్ని అలవాట్లు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తక్షణం వదిలించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇవేంటో ఓసారి చూద్దాం.

Health: ఈ 8 అలవాట్లు ఉంటే బ్రెయిన్ డ్యామేజ్ పక్కా!

ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో (Health) జీవించాలన్నా, జీవితాన్ని ఆస్వాదించాలన్న మంచి ఆరోగ్యం ముఖ్యం. చెడు అలవాట్లతో ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది. ముఖ్యంగా, మెదడు పనితీరును ఎనిమిది అలవాట్లు దారుణంగా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని మానుకుంటే అపాయం నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు (8 habits that will harm your brain).

మెదడు ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. తగినంత నిద్రపోని వారు అనేక శారీరక మానసిక సమస్యలకు చేరువవుతారు. చివరకు ఇది మతిమరుపునకు దారి తీస్తుంది. కాబట్టి, రాత్రిళ్లు నిద్రం దూరం చేసే అలవాట్లు వదిలించుకోవాలి.

Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!


ప్రాసెస్డ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ మెదడుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, మానసిక ఆరోగ్యం వంటివి కుంటుపడతాయి.

నలుగురితో స్నేహబంధాలు నెరపకపోవడం కూడా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటివి కలుగజేస్తుంది. ఇది చివరకు ఆల్జైమర్స్‌ వ్యాధికి దారి తీస్తుంది.

బ్రెయిన్ డ్యామేజ్‌కు కారణమయ్యే ప్రధాన అలవాట్లలో ధూమపానం ఒకటి. దీని వల్ల మెదడు కుంచించుకుపోయి చివరకు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అంతిమంగా ఆల్జైమర్స్ వ్యాధికి కారణమవుతోంది. ధూమపానంతో గుండెజబ్బులు, స్ట్రోక్ వంటివి కూడా వస్తాయి.


నిరంతరం ఒత్తిడికి గురయ్యేవారిలో కూడా మెదడు పనితీరు దెబ్బతింటుంది. ప్రతికూల భావాలు ఒత్తిడి పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ కాలం ఒంటికి ఎండసోకకుండా ఉండటం కూడా మెదడుకు చేటుచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. డిప్రెషన్ బారిన పడే అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. సూర్యరశ్మి వల్ల మెదడు మరింతగా చైతన్యవంతం అవుతుందని అంటున్నారు. ఎండ సోకకుండా ఉండే శరీరంలో సెరొటోనిన్ హార్మోన్ స్థాయిలు పెరిగి డిప్రెషన్ అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

శరీరంలో ఇతర అనారోగ్యాలు కూడా మెదడుకు చేటు చేస్తాయి. కాబట్టి, దీర్ఘకాలిక వ్యాధులు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read Health and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 05:38 PM