Share News

Turmeric: పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా

ABN , Publish Date - Jul 06 , 2024 | 01:22 PM

పసుపు.. వంటింట్లో ఇది ముఖ్యమైన పదార్థం. పసుపు ఆహారానికి రంగు, రుచిని పెంచడమే కాదు.. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిటెకెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

Turmeric: పరగడుపున పసుపు నీళ్లు తాగితే ఇన్ని లాభాలా

ఇంటర్నెట్ డెస్క్: పసుపు.. వంటింట్లో ఇది ముఖ్యమైన పదార్థం. పసుపు ఆహారానికి రంగు, రుచిని పెంచడమే కాదు.. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చిటెకెడు పసుపును తీసుకుంటే ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు.

ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉదర సంబంధిత వ్యాధుల్ని పసుపు నయం చేస్తుంది.


  • ఖాళీ కడుపుతో పసుపు తీసుకుంటే..

  • ప్రతిరోజూ చిటికెడు పసుపు తీసుకుంటే మీ బరువు తగ్గుతుంది. స్థూలకాయం బారి నుంచి బయటపడొచ్చు.

  • పసుపు నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పొట్టను శుభ్రపరుస్తుంది.

  • శరీరంలో మంటను తగ్గిస్తుంది.

  • ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్, సెల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

  • పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

  • ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.

  • నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలగజేస్తుంది.


పసుపును ఎలా తీసుకోవాలి?

ఉదయం నిద్రలేవగానే 1 గ్లాసు నీటిలో చిటికెడు పసుపు వేసి ఖాళీ కడుపుతో తాగేయాలి. లేదా రాత్రి గ్లాసు నీటిలో పసుపు వేసి ఉదయాన్నే వేడి చేసి తాగేయాలి. ఈ నీటిని నోటిలో తిప్పుతూ నిదానంగా తాగాలి. నీరు తాగాక కొంత సేపటి వరకు ఏమీ తినకూడదు. ఇలా నిత్యం చేస్తుంటే ఆరోగ్యం మీవెంటే.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 02:40 PM