Health: బరువు తగ్గాలనుకుంటున్నారా? కొబ్బరితో ఎంతటి మేలు జరుగుతుందో తెలిస్తే..
ABN , Publish Date - Nov 08 , 2024 | 09:12 PM
కొబ్బరితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, దీనితో సులువుగా బరువు తగ్గొచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్‌యే ఇందుకు కారణమని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎండాకాలంలో ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా గుర్తొచ్చేది కొబ్బరి. కొబ్బరి నీళ్లతో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు. అయితే, బరువు తగ్గాలనుకుంటున్న వారికి కూడా కొబ్బరి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో జీవక్రియల వేగం పెరిగి ఎక్కవ కెలొరీలు ఖర్చవుతాయని, ఫలితంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు. అంతేకాకుండా, కొబ్బరి తిన్నాక చాలా సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలగడంతో ఆకలి వేయదని, ఫలితంగా బరువు అదుపులోకి వస్తుందని చెబుతున్నారు (Health).
Viral: మీలో ఈ లక్షణాలు కనిపిస్తే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టే
కొబ్బరి విశిష్టత ఇదే..
నిపుణుల చెప్పే దాని ప్రకారం, కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ ట్రైగ్లిజరైడ్స్‌ను శరీరం సులువుగా గ్రహిస్తుంది. ఇవి లివర్‌లోకి చేరిన వెంటనే జీర్ణమై శక్తినిస్తాయి. కాబట్టి, ఇవి ఇతర పదార్థాల్లాగా కొవ్వుల రూపంలో శరీరంలో నిల్వ ఉండి బరువు పెరిగే అవకాశాలు తక్కువ. అంతేకాకుండా, కొబ్బరి కారణంగా శరీరంలో జీవక్రియల వేగం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో, శరీరంలో చక్కెరలు, కొవ్వులు అధికంగా ఖర్చవుతాయి. ఫలితంగా సులువుగా బరువుతగ్గుతారు. ఇవి తిన్న వారికి చాలా సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి ఆకలేయదని, ఫలితంగా తిండి తగ్గి బరువు నియంత్రణలోకి వస్తుందని కూడా చెబుతున్నారు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరిని దివ్యౌషధంగా భావించకూడదని చెబుతున్నారు. దీనితో పాటు క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబిస్తేనే ఆశించిన రీతిలో బరువు తగ్గుతారని చెబుతున్నారు.
Kapalabhati: కపాలభాతి ప్రాణాయామంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఇక కొబ్బరితో రకరకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు. ఇలా నచ్చిన వంటకం తింటూ శ్రమలేకుండానే బరువు తగ్గొచ్చు. కొబ్బరి నూనెను వంటల్లో, బేకింగ్ కోసం వాడుకోవచ్చు. కొబ్బరి పాలతో స్మూతీలు తయారు చేసుకోవచ్చు. వీటిని కూరలు, సూప్స్‌కు కూడా జత చేసుకోవచ్చు. ఇక కొబ్బరి నీటితో డీహైడ్రేషన్ దరిచేరదన్న విషయం అందరికీ తెలిసిందే. కొబ్బరి యోగర్ట్‌పై తాజా బెర్రీస్, గ్రానోలా వంటివి పెట్టుకుని తింటే మరింత అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి తురుపుకు గుడ్లు, పాలు జత చేసి పాన్ కేక్ చేసుకుంటే కూడా గొప్పగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పాలు, దాల్చిన చెక్క, ఏలకుల వేసి కొబ్బరి రైస్ వండుకుని తింటే కూడా గొప్ప రుచిగా ఉంటుందట. ఫ్లేవర్ కోసం వీటికి రకరకాల కూరగాయలు జతచేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..