Health: నేలపై కూర్చుని తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
ABN , Publish Date - Jul 13 , 2024 | 07:07 PM
కాళ్లుముడుచుకుని నేలపై కూర్చుని తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. మెదడు రిలాక్స్ అవడం, అన్నం త్వరగా జీర్ణం కావడం, వెన్నెముకు సంబంధిత సమస్యలు తగ్గడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడంటే అందరి ఇళ్లల్లో కుర్చీలు, డైనింగ్ టేబుల్స్ కనిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు భోజనం చేయాలంటే కింద కాళ్లు ముడుచుకుని కూర్చుని తినాల్సిందే. అప్పట్లో ప్రతి ఇంట్లో ఇదే దృశ్యం కనిపించేది. అయితే, ఇలా నేలపై కూర్చుని తినడం ఎంతో ఆరోగ్యకరమైని (Health) వైద్యులు చెబుతున్నారు. దీంతో, పలు ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఓసారి చూద్దాం (Benefits of sitting crossed legged on floor).
Lancet: భారతీయులపై సంచలన అధ్యయనం.. దేశంలో సగానికిపైగా ప్రజల పరిస్థితి ఇదే!
వైద్యులు చెప్పే దాని ప్రకారం, కింద కూర్చుని తినేటప్పుడు ఎదో పని మీద పలుమార్లు లేవాల్సి వస్తుంది. ఇది అంతిమంగా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. మనసు కూడా రిలాక్స్ అవుతుంది.
నేలపై కాళ్లు ముడుచుకుని కూర్చుని తినేటప్పుడు వెన్నెముక నిటారుగా మారుతుంది. సహజ వంపులకు అనుగుణంగా ఉంటుంది. యోగాసనంలాగా ఉండే ఈ పొజిషన్ వద్ద వెన్నెముకలోని అన్ని భాగాలు బలపడి వీపు ద్రుఢంగా మారుతుంది. దీంతో, ఎముకలు కూడా గట్టిపడతాయి.
నేలపై కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణరసాలు బాగా ఉత్పత్తి అయ్యి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
నేలపై కూర్చుని తినడం వల్ల వెదడు కూడా రిలాక్స్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇక కుటుంబమంతా ఇలా కూర్చుని తింటే బంధాలు బలపడి మానసిక శాంతి లభిస్తుంది.
నేలపై కూర్చుని తినడం వల్ల ఎంత తింటున్నామనే విషయం అవగాహనపై ఉంటుందని ఫలితంగా పరిమితంగా ఆహారం తీనడం సాధ్యమవుతుందని కూడా వైద్యులు చెబుతున్నారు.
అయితే, నేలపై కూర్చుని తినే సందర్భాల్లో ఒక్కోసారి ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా ఇలా తినడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుందట. అంతేకాకుండా, నిటారుగా కాకుండా అలవాటు ప్రకారం ముందుకు వంగి కూర్చుంటే వీపునకు సంబంధించి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే, కీళ్ల నొప్పులతో సతమతమయ్యే వారు ఇలా నేలపై కూర్చుని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాబట్టి, ఆరోగ్యంగా ఉన్న వారు నేలపై కూర్చుని తినడం అన్ని విధాలా శ్రేయస్కరమని వైద్యులు చెబుతున్నారు.