Ayurveda Vs Korean: ఆయుర్వేద చర్మ సంరక్షణ, కొరియన్ చర్మ సంరక్షణ.. రెండింటిలో ఏది ఎఫెక్ట్ అంటే..
ABN , Publish Date - Nov 11 , 2024 | 04:24 PM
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించడానికి ఆయుర్వేదం, కొరియన్ చర్మ సంరక్షణ పద్దుతులు రెండు వాడతారు. అయితే రెండింటిలో ఏది మంచిదంటే..
ఆయుర్వేదం అనేది భారతీయ పురాతన వైద్య పద్దతులలో ఒకటి. ఇందులో చాలా రహస్యమైన, శక్తివంతమైన పద్దతులు ఉన్నాయి. చర్మ సంరక్షణలో కూడా ఆయుర్వేదం చాలా శక్తివంతమైన విధానాలు కలిగి ఉంది. ఇక ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సౌందర్య సంరక్షణలో కొరియన్ పద్దతులు ఎక్కువగా ఉన్నాయి. ఇవి బ్యూటీ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.. అయితే చర్మ సంరక్షణలో ఆయుర్వేదం మంచిదా.. కొరియన్ చర్మ సంరక్షణ మంచిదా పూర్తీగా తెలుసుకుంటే..
ఆయుర్వేద చర్మ సంరక్షణ..
ఆయుర్వేద చర్మ సంరక్షణలో వేప, పసుపు, ముల్తానీ మట్టి, పాలు, కుంకుమ పువ్వు, అశ్వగంధ.. వంటి సహజ పదార్థాలు ఉంటాయి. వీటిని వందల సంవత్సరాల నుండి ఉపయోగిస్తున్నారు. ఇవి చర్మాన్ని సహజ స్థితిలో ఉంచడంలో, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆయుర్వేద పదార్థాలు వ్యక్తుల చర్మం రకం, శరీర రకాన్ని బట్టి వాటి ఫలితాలు ఇస్తాయి.
కొరియన్ చర్మ సంరక్షణ..
కొరియన్ చర్మ సంరక్షణ ప్రధానంగా హైడ్రేటింగ్ పదార్థాలు కలిగి ఉంటుంది. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. చర్మ దెబ్బ తినే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొరియన్ ఉత్పత్తులు అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా సున్నిత చర్మం కలిగిన వారికి కూడా ఇవి బాగా పనిచేస్తాయి. చర్మం రంగు, చర్మానికి పోషణ, చర్మ రక్షణ మాత్రమే కాకుండా చర్మానికి యాంటీ ఏజింగ్ గుణాలను అందించడంలో కూడా కొరియన్ చర్మ సంరక్షణ పద్దతులు సహాయపడతాయి.
Health Tips: వంటల్లో పచ్చ కర్పూరం ఎందుకు జోడిస్తారు? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిదంటే..
ఏది మంచిది..
ఆయుర్వేదం చాలా గొప్పది అయినా దీని వల్ల కలిగే ఫలితాలు చాలా నెమ్మదిగా తెలుస్తాయి. ఇవి దీర్ఘకాలం ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదం అనుసరించాలంటే ఓపిక అవసరం. అలాగే నాణ్యమైన పదార్థాలు కూడా అవసరం. చర్మానికి తగిన పదార్థాల ఎంపిక కూడా అవసరం.
కొరియన్ చర్మ సంరక్షణ వివిధ దశలలో ఉంటుంది. ఫేస్ వాష్, స్టీమింగ్, క్లెన్సర్, పేస్ ప్యాక్, మాయిశ్చరైజర్, సీరమ్ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి. సహజంగా కొరియన్ చర్మం కావలంటే బియ్యం నీరు, ఆవిరి పట్టడం, బియ్యం టోనర్, బియ్యం పిండి ఫేస్ ప్యాక్ వంటివి సహాయపడతాయి.
ఇవి కూడా చదవండి..
మాంసాహారాన్ని తలదన్నే గింజలు ఇవి.. వీటిలో ప్రోటీన్ ఎంతంటే..
పిల్లలలో కాన్ఫిడెంట్ పెరగాలంటే.. తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులు ఇవీ..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.