Basil Seeds: తులసి గింజలు ఆరోగ్యానికి మంచివేనా? ఇవి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటే..!
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:43 PM
తులసి ఆకులే కాదు దాని గింజలు కూడా ఆహారంలో భాగంగా వాడుతుంటారు. ఇవి శరీరం మీద చూపించే ప్రభావం ఎలాగుంటుందంటే..
భారతదేశంలో తులసి మొక్కను దైవ సమానంగా చూస్తారు. దేవుళ్లతో సమానంగా పూజిస్తారు. చాలా ఇళ్లలో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. ఇది కేవలం భక్తి పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా గొప్ప ఔషద మొక్క. ఎన్నో వ్యాధుల నుండి బయటపడటానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. ఒక్క తులసి ఆకు చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ తులసి ఆకులతో సులభంగా నయమవుతుంది. అయితే తులసి ఆకులే కాదు దాని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఐరన్, మెగ్నీషియం వంటి మూలకాలు తులసి గింజల్లో ఉంటాయి. తులసి గింజలు శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకుంటే..
రోగనిరోధక..
తులసి గింజలు బలహీనమైన రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తులసి గింజలతో తయారు చేసిన కషాయాలను త్రాగవచ్చు.
ఇది కూాడా చదవండి: జుట్టు పెరుగుదలను అమాంతం పెంచే యోగాసనాలు ఇవీ..!
జీర్ణశక్తి..
ఎసిడిటీ, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉంటే తులసి గింజలు చాలా ప్రభావవంతగా పనిచేస్తాయి. 1 టీస్పూన్ తులసి గింజలను ఒక గ్లాసు నీటిలో వేసి అవి ఉబ్బిన తర్వాత త్రాగాలి.
మలబద్ధకం..
తులసి గింజలను తీసుకోవడం వల్ల మలబద్దకానికి చెక్ పెట్టవచ్చు. ఇవి మలబద్దకానికి సహజమైన ఔషదంగా పనిచేస్తాయి. తులసి గింజలలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
చక్కెర స్థాయి..
తులసి గింజలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. తులసి గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మధుమేహంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.