Health: ఒత్తిడితో ఎక్కువగా ప్రభావితమయ్యే శరీర భాగాలు ఇవ్వే!
ABN , Publish Date - Jun 23 , 2024 | 10:19 PM
ఒత్తిడి, ఆందోళనతో శరీరంలోని కొన్ని భాగాలపై ప్రతికూల ప్రభావం మిగతా వాటికంటే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక జీవినశైలి (Lifestyle) కారణంగా మనషులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఒత్తిడితో అనారోగ్యం పాలవుతారని అందరికీ తెలిసిందే. అయితే, ఒత్తిడి (Stress), ఆందోళనతో (Anxiety) శరీరంలోని కొన్ని భాగాలపై ప్రతికూల ప్రభావం మిగతా వాటికంటే ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం (Body parts that are more affected by stress and anxiety).
Weight Loss: ఈ 6 కసరత్తులతో డైటింగ్ లేకుండానే బరువు తగ్గుతారు! ఇది పక్కా!
ఒత్తిడి కారణంగా కండరాలు, కీళ్లపై చెడు ప్రభావం పడుతుంద. పరిస్థితి ముదిరితే ఆర్థరైటిస్, ఫైబ్రోమయాల్జియా తదితర వ్యాధుల బారినపడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒత్తిడి జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం చూపిస్తుంది. కడుపులో తిప్పడం, మలబద్ధం మొదలు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ వంటి పెద్ద సమస్యల వరకూ అనేకం వేధిస్తాయని చెబుతున్నారు.
భుజాలు, తల, దవడలపై కూడా ఒత్తిడి తాలూకు ప్రభావం అధికంగా ఉంటుంది. తలనొప్పి, భుజాలు, మెడ, దవడ నొప్పి వంటి సమస్యలు వేధిస్తాయని అంటున్నారు.
వ్యాధులను దరిచేరకుండా చేసే రోగ నిరోధక శక్తిపై కూడా ఒత్తిడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. చివరకు ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా తలెత్తొచ్చు
ఒత్తిడి ప్రభావం కారణంగా చర్మం సౌందర్యం తగ్గి , జుట్టు బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎగ్జీమా, రోసాసియా, సోరియాసిస్ వంటి చర్మసంబంధిత సమస్యలు వేధిస్తాయని అంటున్నారు. దురదలు, అతిగా చెమటపట్టడం వంటి సమస్యలు కూడా ఉంటాయని అంటున్నారు.