Bok Choy: ఈ చైనీస్ కూరగాయ తింటే కలిగే షాకింగ్ ప్రయోజనాలేంటో తెలుసా?
ABN , Publish Date - Feb 11 , 2024 | 10:51 AM
విదేశాలలో వింత వింత కూరగాయలు కనిపిస్తుంటాయి. అలాంటివాటిలో బోక్ చోయ్ కూడా ఒకటి. దీన్ని చైనీస్ క్యాబేజీ అని కూడా అంటారు. దీన్ని తీసుకుంటే కలిగే లాభాలేంటంటే..
కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. ప్రాంతీయతను బట్టి ఇవి విభిన్నంగా ఉంటాయి. ఇక విదేశాలలో అయితే వింత వింత కూరగాయలు కనిపిస్తుంటాయి. అలాంటివాటిలో బోక్ చోయ్ కూడా ఒకటి. చైనాలో లభించే దీన్ని చైనా క్యాబేజీ అని కూడా అంటారు. చైనా క్యాబేజీ ప్రస్తుతం సూపర్ మార్కెట్లు, డిమార్ట్ వంటి చోట్ల కూడా లభిస్తోంది. దీన్ని ఆహారంలో తీసుకోవడం వల్ల షాకింగ్ ప్రయోజనాలుంటాయి. అవేంటో.. ఇందులో ఉన్న పోషకాలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..
పోషకాలకు పవర్ హౌస్..
చైనీస్ క్యాబేజీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-కె, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రించడంలోనూ ఇది చాలా బాగా సహాయపడుతుంది. అలాగే శరీరం మొత్తానికి ఆరోగ్యం చేకూరుస్తుంది.
ఇది కూడా చదవండి: చిటికెడు జాజికాయ పొడిని రోజూ తీసుకుంటే.. జరిగేదిదే..!
రోగనిరోధక శక్తి..
బోక్ చోయ్ లేదా చైనీస్ క్యాబేజీ క్రూసిఫరస్ జాతికి చెందిన కూరగాయ. విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది. ఇందులో బీటా-కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కేలరీలు..
చైనీస్ క్యాబేజీలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది చాలా మంచి ఎంపిక. ఇందులో ఉన్న పోషకాలు, కేలరీల పరంగా చూస్తే దీన్ని తీసుకుంటే అటు పోషకాలు పొందవచ్చు, ఇటు కడుపు నిండిన ఫీల్ కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడానికి ఇది మంచి ఆప్షన్. అలాగే హెల్తీ డైట్ ఫాలో అయ్యేవారికి కూడా మంచి ఎంపిక.
కంటి ఆరోగ్యం..
చైనీస్ క్యాబేజీలో బీటా-కెరోటిన్, విటమిన్-ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వయస్సు పరంగా వచ్చే కంటి సంబంధ సమస్యలను కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యం..
పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచడంలో చైనీస్ క్యాబేజీ సహాయపడుతుంది. ఇందులో ఫోలేట్, విటమిన్ బి6 కూడా ఉంటాయి. ఇవి హోమోసెస్టీన్ అనే అమైనో ఆమ్లం పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలివీ..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.