Share News

Bra Vs Breast Cancer: బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజాలెంతంటే..!

ABN , Publish Date - Jul 06 , 2024 | 12:09 PM

కొందరు మహిళలకు వక్షోజాల పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి వారు చాలా బిగుతుగా ఉన్న బ్రా లను ధరిస్తుంటారు. ఇలా బిగుతుగా ఉన్న బ్రా లను ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనే వార్త చాలా కాలం నుండి వైరల్ అవుతోంది. అసలు బ్రా ధరించడానికి, బ్రెస్ట్ క్యాన్సర్ కు..

Bra Vs Breast Cancer: బిగుతుగా ఉండే బ్రా ధరిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇందులో నిజాలెంతంటే..!

నేటి కాలం అమ్మాయిలు బ్రా ధరించడం కామన్. వక్షోజాల కదలికను నియంత్రించడానికి మాత్రమే కాకుండా డ్రస్సులు వేసుకున్నప్పుడు మంచి ఆకృతిని ఇవ్వడంలో కూడా బ్రా లు సహాయపడతాయి. అయితే కొందరు మహిళలకు వక్షోజాల పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. ఇలాంటి వారు చాలా బిగుతుగా ఉన్న బ్రా లను ధరిస్తుంటారు. ఇలా బిగుతుగా ఉన్న బ్రా లను ధరించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనే వార్త చాలా కాలం నుండి వైరల్ అవుతోంది. అసలు బ్రా ధరించడానికి, బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధం ఏంటి? తెలుసుకుంటే..

బిగుతుగా ఉండే బ్రాలు ధరిస్తే రొమ్ము క్యాన్సర్ వస్తుందని చాలా మంది అంటుంటారు. దీనికి సంబంధించి వార్తలు కూడా చాలా విరివిగా ప్రచారం అవుతుంటాయి. అయితే బిగుతుగా ఉన్న బ్రాలు ధరిస్తే క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అంటున్నారు.

ఈ 5 పండ్లు తినండి చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..!


బిగుతుగా ఉన్న బ్రాలు ధరిస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందనే వార్త బ్రాలు రొమ్ము లోపలి కణజాలం పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే అపోహల నుండి పుట్టుకొచ్చినవట.

రొమ్ము క్యాన్సర్ కు సంబంధించి ప్రాథమిక ప్రమాద కారకాలు జన్యుశాస్త్రం, వయస్సు, కుటుంబ చరిత్ర, ఆహారం, మద్యపానం, శారీరక శ్రమ, జీవనశైలి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. బిగుతుగా ఉన్న బ్రాలు ధరించడం, బిగుతుగా ఉన్న దుస్తులు ధరించడం రొమ్ము క్యాన్సర్ కు ప్రాథమిక కారణం కాదు.

బిగుతుగా ఉన్న బ్రాలు ధరించడం వల్ల కొంత అసౌకర్యం ఏర్పడటం సహజమే. బిగుతుగా ఉన్న బ్రాలు ధరించడం వల్ల రొమ్ము ప్రాంతానికి రక్తప్రసరణ తగ్గడం కూడా జరుగుతుంది. అయితే ఇది రొమ్ము క్యాన్సర్ కు కారణం కాదు. బ్రా వల్ల రొమ్ము భాగంలో చర్మం చికాకు పెట్టడం, అసౌకర్యం వంటివి సంభవిస్తుంటాయి. కానీ ఇవన్నీ క్యాన్సర్ అభివృద్దికి సంబంధించినవి కాదు.

భారత్ లో చాలామంది ఎదుర్కొంటున్న పోషక లోపాల లిస్ట్ ఇదీ..!


బిగుతుగా ఉన్న బ్రాలు ధరిస్తే శోషరస పారుదలకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది టాక్సిన్ లు ఏర్పడటానికి, క్యాన్సర్ కు దారితీస్తుందని సూచిస్తున్నాయి. అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ పరిశోధనలు, ఆధారాలు లేవని అంటున్నారు. కానీ సౌకర్యంగా ఉండటం కోసం సరిపోయే బ్రా ధరించడం, బ్రా తయారీకి ఉపయోగించిన వస్త్రం రకం వంటివి చూసుకోవాలి. బ్రా లు ఎప్పుడూ మంచి ఎలాస్టిక్ తో తయారైనవై ఉండాలి. ఇలాంటి బ్రా లు ధరిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు.

భారత్ లో చాలామంది ఎదుర్కొంటున్న పోషక లోపాల లిస్ట్ ఇదీ..!

ఈ 5 పండ్లు తినండి చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతం..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 06 , 2024 | 12:09 PM