Share News

Cancer: పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. మహిళలే కాదు పురుషుల్లో కూడా..!

ABN , Publish Date - Oct 15 , 2024 | 11:00 AM

ప్రమాదంగా పరిగణించే 5 రకాల క్యాన్సర్లను ఎక్కువగా ఎదుర్కుంటున్న దేశాల జాబితాలో భారతదేశం ఉన్న స్థానమేంటో తెలిస్తే షాకవుతారు.

Cancer:  పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. మహిళలే కాదు పురుషుల్లో కూడా..!
Cancer

క్యాన్సర్.. ప్రపంచంలో అధిక మరణాలకు కారణం అవుతున్న రెండవ అతి పెద్ద సమస్య. మొదటి స్థానంలో గుండె జబ్బులు ఉండగా.. రెండవ స్థానంలో క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి. మగవారికి వచ్చే క్యాన్సర్, మహిళలకు వచ్చే క్యాన్సర్ వేరుగా ఉంటున్నాయి. ప్రమాదంగా పరిగణించే 5 రకాల క్యాన్సర్లను ఎక్కువగా ఎదుర్కుంటున్న దేశాల జాబితాలో భారతదేశం మూడవ స్థానంలో ఉండటం భారతీయులను ఆందోళనకు గురిచేసే అంశం. భారతదేశపు అగ్ర పరిశోధనా సంస్థ అయిన ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్కేటిక్స్ అండ్ రీసెర్చ్ కొన్ని అధ్యయనాల ద్వారా క్యాన్సర్ గురించి కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అవేంటో తెలుసుకుంటే..

Health Tips: పైల్స్ తో బాధపడుతున్నారా? ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే..!


cancer2.jpg

భారతదేశంలో క్యాన్సర్ రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషులలో నోటి క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతోంది. పెదవులు, నోటి క్యాన్సర్ల బారిన పడుతున్న మగవారు ఎక్కువగా ఉంటే.. మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. బ్రిక్స్ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా లలో క్యాన్సర్ కేసులు, మరణాలు, జీవన నాణ్యత మొదలైన విషయాలపై పరిశోధనలు చేశారు. వీటి కారణంగా జరుగుతున్న మరణాలను లెక్కించారు.

రష్యాలో కొత్త క్యాన్సర్ కేసులు పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ అత్యధికంగా నమోదు అవుతున్నాయని తేలింది. రష్యాలో పురుషులకు ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్ క్యాన్సర్ లు ఎక్కువగా ఉంటున్నాయి. కాగా.. భారతదేశంలో మాత్రం పెదవులు, నోటి క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయట. బ్రిక్స్ దేశాలలో మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నవారు ఎక్కువ.

Hair Growth: ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..!


cancer1.jpg

క్యాన్సర్ కారణంగా ఏర్పడుతున్న మరణాల రేటు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా ఉందని అధ్యయనాలు పేర్కొన్నాయి. వీటిలో కూడా మహిళలే క్యాన్సర్ కారణంగా ఎక్కువగా మరణిస్తున్నారు. భారతదేశం మినహాయిస్తే బ్రిక్స్ దేశాలలో అన్ని దేశాలలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా ఉంది. భారతదేశంలో అత్యధిక మరణాలకు రొమ్ము క్యాన్సర్ కారణం అవుతోంది. శ్వాసనాళాల క్యాన్సర్లు కూడా నమోదు అవుతున్నాయి. పరిశోధనల ప్రకారం రాబోయే కాలంలో దక్షిణాఫ్రికా, భారతదేశాలలో కొత్త క్యాన్సర్ కేసుల కారణంగా కలిగే మరణాలు ఎక్కువగా ఉంటాయట. గత ఐదేళ్లలో భారతదేశంలో క్యాన్సర్ కేసులు 12.8శాతం పెరిగాయని అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

ఆఫీసులో నిద్ర వస్తుందా.. ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి..!

కొలెస్ట్రాల్ పెరిగితే శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 15 , 2024 | 11:00 AM