Carom seeds: వాము గింజల వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని మీకు తెలుసా?
ABN , Publish Date - Mar 30 , 2024 | 04:26 PM
వంటల్లో ఉపయోగించే వాము వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తెలిస్తే షాకవుతారు.
వాము పేరు చెప్పగానే చాలామందికి సమోసా, మిర్చీ బజ్జీలు వంటి స్నాక్స్ గుర్తుకు వస్తాయి. వాము గింజలు జీలకర్ర కంటే చిన్నగా ఘాటుగా, కారం రుచిని కలిగి ఉంటాయి. ఈ గింజలను ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా తక్కువ. కానీ వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా దగ్గు, శ్వాస నాళం సంకుచితం, ఆస్తమా వంటి సమస్యలకు కూడా వాము గింజలు పనిచేస్తాయని అంటారు. వాము గింజలను ఆహారంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటంటే..
శ్వాస..
శ్వాసకోశం సంకోచించడం కారణంగా శ్వాస తీసుకున్నప్పుడు పూర్తీగా ఒక్కసారిగా అది ఊపిరితిత్తులలోకి ప్రవేశించదు. దీని వల్ల మాట్లాడేటప్పుడు ఊపిరి ఆడకపోవడం, ఊపిరి తీసుకున్నప్పుడు గురక రావడం వంటి సమస్యలు వస్తాయి. అయితే వాము గింజలు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు, ఆస్తమా రోగులలో శ్వాస నాళాలు సడలి గాలి ప్రవాహం పెరుగుతుంది.
ఇది కూడా చదవండి: వేసవికాలంలో పొరపాటున కూడా తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!
రక్తపోటు..
అధిక రక్తపోటు, గుండె, మెదడును దెబ్బతీస్తుంది. ఎక్కువకాలం రక్తపోటు నియంత్రణలో లేకుండా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చేసమస్యలు ఎక్కవ. వాము గింజలలో థైమోల్ ఉంటుంది. ఇది రక్తనాళాలలను సడలిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
లిపిడ్లు..
వాము గింజలు లిపిడ్ ప్రొపైల్ ను సమతుల్యం చేస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, హెచ్డియల్ మొదలైనవి దీని కిందకు వస్తాయి. వాము గింజలను తీసుకుని వీటిని అదుపులో ఉంచుకోవడం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుండి ప్రొటెక్షన్..
బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్పెక్షన్లు తీవ్రంగా ఉంటాయి. వాము గింజల వినియోగం వల్ల సాల్మోనెల్లా, ఇకోలి వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. అంతేకాదు ఈ ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ..
వాము గింజలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోపల మంటలతో పోరడటానికి సహాయపడతాయి. వాము గింజలను ఉపయోగించడం వల్ల వాపు తగ్గుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉదర సంబంధ సమస్యలు..
చాలావరకు ఇంటి వైద్యలో వాము గింజలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలను పరిశ్కరించడానికి వాము బాగా సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంతో పాటూ పెస్టిక్ అల్సర్ వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.