Share News

Castor Oil: ముఖానికి ఆముదం రాయడం మంచిదేనా? చాలామందికి తెలియని నిజాలివీ..

ABN , Publish Date - Oct 30 , 2024 | 04:19 PM

ఆముదం చిక్కగా ఉంటుంది. కొందరు దీన్ని ముఖానికి రాసుకుంటారు. కానీ ఈ నిజాలు చాలామందికి తెలియవు.

Castor Oil: ముఖానికి ఆముదం రాయడం మంచిదేనా? చాలామందికి తెలియని నిజాలివీ..
Castor Oil

ఆముదం ఈ మధ్యకాలంలో జుట్టు సంరక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆముదం విత్తనాల నుండి తయారు చేస్తారు. ఆముదం చిక్కగా ఉంటుంది. సాధారణంగా దీన్ని ఆయుర్వేదంలో భాగంగా పేర్కొంటారు. ఆముదాన్ని జుట్టుకు రాయడం వల్ల జుట్టు మందంగా, నల్లగా మారుతుందని, జుట్టు పెరుగుదల కూడా ఆరోగ్యంగా ఉంటుందని అంటారు. అయితే ఆముదాన్ని కేవలం జుట్టుకే కాదు.. చర్మ సంరక్షణలో కొందరు వాడుతారు. అసలు ఆముదాన్ని చర్మానికి రాయడం సురక్షితమేనా.. ఆముదంలో ఉండే గుణాలు ఏంటి? ఆముదాన్ని చర్మానికి ఎలా వాడతారు? వివరాలన్నీ తెలుసుకుంటే..

Health Tips: పండుగ ముందు పొట్ట ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే ఈ నీరు తాగండి..


ఆముదంలో పోషకాలు..

ఆముదంలో లినోలిక్ యాసిడ్, స్టియరిక్ యాసిడ్, రిసినోలిక్ యాసిడ్ వంటి ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ప్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆముదంలో ఒమేగా-6, ఒమేగా-9 వంటి కొవ్వులు కూడా ఉంటాయి. ఆముదాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.

ఆముదం ప్రయోజనాలు..

ముడతలు..

ఆముదం శరీరం కోల్పోయిన కణాలను తిరిగి భర్తీ చేయడంలో సహాయపడుతుంది. చర్మానికి ఆయువును పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగా ఇది చర్మం మీద ముడుతలను నివారిస్తుంది. ఆముదంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను తొలగించడంలో సహాయపడతాయి. వృద్దాప్యాన్ని నెమ్మది చేస్తాయి.

Diabetes: జస్ట్.. రోజూ ఒక్క గ్లాస్ దీన్ని తాగారంటే చాలు.. దెబ్బకు షుగర్ సమస్య తోక ముడుస్తుంది..


మొటిమలు..

ఆముదంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది మొటిమలను, పగిలిన చర్మాన్ని తగ్గిచండంలో సహాయపడుతుంది. ముఖం నుండి బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మొటిమలు రాకుండా చేస్తుంది. సాధారణంగా వివిధ కారణాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతుంటాయి. ఈ కారణంగా మొటిమలు ఏర్పడతాయి. ఈ మొటిమలను ఆముదం తగ్గిస్తుంది.

ఉబ్బరం..

ఆముదంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది వాపు, ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఐ బ్యాగ్స్ తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ఆముదంలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. వైద్యుల సలహా మేరకు ఆముదాన్ని కడుపుకు తీసుకోవడం వల్ల కడుపు శుభ్రపడుతుంది.

Health Tips: వంటింట్లో ఉండే ఈ నేచురల్ పెయిన్ కిల్లర్స్ గురించి తెలుసా..!


హైడ్రేట్..

ఆముదం చిక్కగా ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మం తేమగా, మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. పొడి చర్మాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది గొప్ప మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పొడి పెదవులు ఉన్నవారికి మంచిది.

చర్మానికి ఎలా వాడాలి..

గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. అరచేతులపై కొన్ని చుక్కల ఆముదం తీసుకోవాలి. అరచేతులకు మొత్తం ఆముదాన్ని రాసుకుని వృత్తాకార కదలికలో ముఖంపై నెమ్మదిగా, సున్నితంగా రుద్దాలి. రాత్రంతా అలాగే ఉండాలి. మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో ముఖాన్ని కడగాలి.

ఆముదం మందంగా ఉంటుంది. దీనిని కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ నూనె వంటి ఇతర నూనెలతో కలపవచ్చు. సులభంగా అప్లై చేయడం కోసం, ఆముదం నూనెను డ్రాపర్ బాటిల్‌లో ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి..

జీలకర్రను ఇలా వాడితే శరీరంలో కొవ్వు కరిగిపోద్ది..

ఈ లక్షణాలు కనిపిస్తే.. బోలు ఎముకల వ్యాధి మొదలైనట్టే..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 30 , 2024 | 04:26 PM