Chillies: మనం వంటల్లో వాడే మిరపకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలు ఇవీ..!
ABN , Publish Date - Feb 20 , 2024 | 02:57 PM
మిరపకాయలు కేవలం కారం రుచి కోసం మాత్రమే అనుకుంటాం. కానీ వీటి గురించి అసలు నిజాలు ఇవీ..
మిరపకాయలు అన్ని చోట్లా ప్రజలందరూ ఉపయోగించే కూరగాయ. ఇవి ఆహారానికి కారపు రుచిని ఇస్తాయి. చాలావరకు కారం లేకుండా ఆహారం తీసుకునేవారు ఉండరు. కారం వేయకపోతే వంట రుచిగా కూడా ఉండదు.అయితే మిరపకాయలు కేవలం కారం రుచి కోసం మాత్రమే కాదు.. దీని వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. వంటల్లో వాడే మిరపకాయల వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఓసారి చూస్తే..
జీవక్రియ..
జీవక్రియ వేగంగా ఉండాలంటే మిరపకాయలు ఆహారంలో ఉండాల్సిందే.. మిరపకాయలలో ఉండే వేడి గుణానికి కారణమైన క్యాప్సైసిన్ అనే సమ్మేళనం జీవక్రియ రేటును పెంచుతుంది. మిరపకాయలను తీసుకోవడం వల్ల క్యాలరీలు బర్నింగ్‌లో సహాయపడతాయి. తద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే ఓ చిన్న ముక్క అల్లం నమిలి తింటే.. జరిగేదిదే..!
యాంటీ ఆక్సిడెంట్లు..
మిరపకాయలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవటానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి. విటమిన్ సి, కెరోటినాయిడ్స్ వంటి ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
నొప్పి తగ్గిస్తాయి..
మిరపకాయలు మంటను కలిగించినప్పటికీ ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే క్యాప్సైసిన్ నొప్పి నివారణ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. కండరాల నొప్పి, ఆర్థరైటిస్‌తో సహా వివిధ రకాల సమస్యలకు ఇది చక్కగా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యం..
గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా మిరపకాయలు ప్రభావవంతంగా ఉంటాయి. వీటిలో ఉండే క్యాప్సైసిన్ రక్తపోటును తగ్గించడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. గుండెపోటులు, స్ట్రోక్స్ వంటి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గింస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంతో పాటు గుండె ఆరోగ్యానికి మరింత మద్దతునిస్తాయి.
రోగనిరోధక శక్తి..
మిరపకాయలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి మిరపకాయలలో పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో పనిచేస్తుంది. క్యాప్సైసిన్ లో యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: చిరుతపులి vs చిరుత.. రెండింటిలో ఏది ఎక్కువ శక్తివంతమైనది?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.