Share News

Cholesterol: ఆయుర్వేదం చెప్పిన చిట్కా.. ఈ పానీయాన్ని తాగితే చాలు.. కొలెస్ట్రాల్ దానంతట అదే తగ్గిపోతుంది..

ABN , Publish Date - Nov 12 , 2024 | 05:54 PM

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే చాలా రకాల సమస్యలు వస్తాయి. వీటిని సింపుల్ గా తగ్గించాలి అంటే ఈ పానీయం తాగాలి.

Cholesterol: ఆయుర్వేదం చెప్పిన చిట్కా.. ఈ పానీయాన్ని తాగితే చాలు..   కొలెస్ట్రాల్ దానంతట అదే తగ్గిపోతుంది..
Cholesterol

కొలెస్ట్రాల్ మనిషి ఆయుష్షును తగ్గించే సమస్య. ఇది చాప కింద నీరులా శరీరంలో పేరుకుపోతుంది. అధిక బరువు ఉన్న వారిలో కొలెస్ట్రాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి జిమ్, వ్యాయామం, నడక వంటివి ఫాలో అవుతుంటారు. ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకుంటారు. కొలెస్ట్రాల్ నియంత్రించడానికి చాలా రకాల ఇంటి చిట్కాలు.. పానీయాలు పాలో అవుతుంటారు. కానీ దీనికి చాలా సింపుల్ గా చేసుకోగలిగే చిట్కాను ఆయుర్వేదం వెల్లడించింది. ఆయుర్వేదం చెప్పిన ఒకే ఒక్క పానీయం తాగుతుంటే శరీరంలో కొలెస్ట్రాల్ దానంతట అదే తగ్గిపోతుందట. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

Guava: చలికాలంలో జామపండ్లు తినాలని చెప్పేది ఇందుకే.. ఆయుర్వేదం ఏం చెప్పిందంటే..


తులసి ఒక మ్యాజిక్ అని చెప్పవచ్చు. ఇందులో ఉంటే అడాప్టోజెన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇప్పట్లో రేడియోథెరపీ ప్రభావాలను తగ్గించే సామర్థ్యాన్ని తులసి కలిగి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా తులసి బాగా సహాయపడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి తులసి టీ..

  • తులసి టీ తయారు చేసుకోవడానికి 5 తులసి ఆకులు సరిపోతాయి.

  • ఒక గిన్నె తీసుకుని అందులో 250 మి.లీ నీరు పోయాలి. ఇందులో కొంచెం అల్లం తురుము వేయాలి. ఇందులో 5 తులసి ఆకులు వేసి 3 నుండి 5 నిమిషాలు మరిగించాలి. తరువాత వడపోసి వేడివేడిగా తాగాలి. మరింత రుచిగా తాగాలి అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు అందులో కాసింత తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు.

Hair Growth Gummies: మార్కెట్లో ట్రెండ్ అవుతున్న హెయిర్ గ్రోత్ గమ్మీస్.. ఇంట్లోనే ఇలా ఈజీగా తయారుచేసుకోండి..


తులసి ఆకులను నమిలితే..

తులసి ఆకులను నమలడం అంత ఆరోగ్యం కాదని అంటున్నారు. ఎందుకంటే తులసి ఆకులలో పాదరసం ఉంటుంది. దీన్ని నేరుగా నమిలి తింటే దంతాలు దెబ్బతింటాయి. తులసిలో ఉండే పాదరసం నోట్లోకి విడుదల అవుతుంది. ఈ కారణంగానే చాలామంది తులసి ఆకులు నమిలినప్పుడు కొద్దిగా మంట లేదా ఎలక్టిక్ షాక్ లాంటి అనుభూతికి లోనవుతారు. అందుకే తులసిని టీలో కానీ.. లేదా తులసి రసాన్ని కానీ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి..

కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..

ఈ ఒక్క పండు తింటుంటే చాలు.. కంటి శుక్లానికి చెక్ పెట్టవచ్చట..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Nov 12 , 2024 | 05:54 PM