Health: 87 వేల మందిపై అధ్యయనం! రాత్రుళ్లు లైట్ తక్కువున్న గదిలో నిద్రిస్తే..
ABN , Publish Date - Jul 16 , 2024 | 06:24 PM
రాత్రుళ్లు తక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రిస్తే డయాబెటిస్ - 2 ప్రమాదం చాలా వరకూ తగ్గిపోతుందట. బ్రిటన్‌లో జరిగిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. 87 వేల మంది స్త్రీపురుషులపై 8 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: డయాబెటిస్ - 2 కు అడ్డుకట్ట వేసేందుకు బరువు తగ్గడం, కసరత్తులు, ఆరోగ్యకరమైన (Health) ఆహారం తీసుకోమని నిపుణులు సాధారణంగా చెబుతుంటారు. అయితే, ఇంతకంటే సులభమైన టెక్నిక్ కూడా ఉందని బ్రిటన్‌లో ఇటీవల జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. రాత్రుళ్లు తక్కువ వెలుతురు ఉన్న గదిలో నిద్రిస్తే డయాబెటిస్ - 2 ప్రమాదం చాలా వరకూ తగ్గిపోతుందట.
మొత్తం 85 వేల మంది స్త్రీ పురుషులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. రాత్రి 12.30 నుంచి ఉదయం 6 గంటల వరకూ వారి నిద్రను పరిశీలించారు. ఈ సమయాల్లో తక్కువ వెలుతురు ఉన్న గదిలో పడుకునే వారికంటే ఎక్కువ వెలుతరు ఉన్న వారిలో ఈ తరహా డయాబెటిస్ రిస్క్ చాలా వరకూ పెరిగిందట (Darker rooms reduces the risk of developing diabetes type 2).
Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!
నిపుణులు చెప్పే దాని ప్రకారం, రాత్రుళ్లు గదిలోని వెలుతురు మన నిద్ర తీరుతెన్నులను ప్రభావితం చేస్తుంది. శరీరంలోని రక్తంలో చక్కెర నియంత్రణ వంటి అనేక జీవ క్రియలు మన నిద్ర తీరుతెన్నులపైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు.. మెదడు కొన్ని రకాల హార్మొన్లను విడుదల చేసేందుకు రాత్రుళ్లు కనిపించే వెలుతురి స్థాయిపైనే ఆధారపడుతుంది. ఇందులో ఇబ్బంది తలెత్తిత్తే అంతిమంగా జీవక్రియలు ప్రభావితమవుతాయి.
కాగా, ఈ అధ్యయనంలో పాల్గొన్న స్త్రీ పురుషులపై ఏకంగా ఎనిమిదేళ్ల పాటు అధ్యయనం చేశారు. ఎవరికి డయాబెటిస్ బారిన పడిందీ, ఎప్పుడు ఈ వ్యాధీ ప్రారంభమైందీ తదితర అంశాలను పరిశీలిచారు. ఇందుకోసం వారి చేతికి ప్రత్యేక సెన్సర్లు ఉన్న గడియారాన్ని తొడిగారు. తద్వారా, రోజుమొత్తంలో వారిపై వెలుతురు ఏమేరకు పడుతోందో పరిశీలిచారు. రాత్రుళ్లు అత్యధిక వెలుతురులో ఉన్న తొలి 10 శాతం మందిలో డయామెటిస్ వచ్చే అవకాశం ఏకంగా 67 శాతం పెరిగింది. తక్కువ వెలుతురులో పడుకునే వారిలో డయాబెటిస్ నుంచి చాలా వరకూ రక్షణ లభించిందట.