Dental Care: పొద్దున్నే బ్రష్ చేసుకున్నాక ఈ తప్పు మాత్రం చేయొద్దు.. ఓ డెంటిస్ట్ హెచ్చరిక!
ABN , Publish Date - Jul 15 , 2024 | 09:28 PM
బ్రష్ చేసుకున్న వెంటనే మౌత్ వాష్ వాడొద్దని నిపుణుల చెబుతున్నారు. ఈ చర్యతో పళ్ల మీద అప్పటికే టూత్ పేస్ట్ ద్వారా ఏర్పడిన ఫ్లోరైడ్ పొర తొలగి పంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఉదయాన్నే బ్రష్ చేసుకున్నాక మౌత్ వాష్‌ను ఉపయోగించి నోరు రిన్స్ చేస్తుంటారు. చాలా మంది పాటించే దినచర్యలో ముఖ్యమైన భాగం ఇది (Health). మౌత్ వాష్ కారణంగా సూక్ష్మక్రిములు మరింత తగ్గడంతో పాటు నోటి దుర్వాసన నుంచి కూడా విముక్తి కలుగుతుందని ఇలా చేస్తుంటారు. ఫ్లోరైడ్ ఉన్న మౌత్ వాష్‌లతో నోరు రిన్స్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం తప్పని ఓ డెంటిస్టు చెప్పారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Health: పురుషుల్లో కీలక హార్మోన్ టెస్టెస్టిరాన్ తగ్గడానికి కారణాలు ఇవే!
సదరు డెంటిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం, బ్రష్ చేసుకున్న తరువాత ఫ్లోరైడ్ ఉన్న మౌత్ వాష్ అయినా సరే వాడకూడదు. సాధారణంగా మంచి టూత్ పేస్ట్ వాడి బ్రష్ చేసుకున్నాక పళ్లపై ఫ్లోరైడ్ పొర ఏర్పడుతుంది. ఆ తరువాత మౌత్ వాష్‌తో నోటిని రిన్స్ చేసుకుంటే ఈ పొర తొలగిపోయి పళ్లు పడాయ్యే అవకాశం పెరుగుతుందని డెంటిస్ట్ పేర్కొన్నారు. మౌత్ వాష్‌లో కూడా ఫ్లోరైడ్ ఉన్నా సరే బ్రష్ చేసుకున్నాక రిన్స్ చేసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు (Do You Use Mouthwash After Brushing Your Teeth Dental Expert Warns Against It).
కాబట్టి, పళ్ల నాలుగు కాలాల పాటు నిలిచి ఉండాలంటే బ్రషింగ్ తరువాత మౌత్ వాష్‌తో రిన్స్ చేయకుండా ఉండటమే బెటరని అన్నారు. అంతేకాకుండా, పళ్ల ఆరోగ్యం కోసం చాక్లెట్లకు దూరంగా ఉండటమే మంచిదని తెలిపారు. బ్రష్ చేసుకున్న వెంటనే కాకుండా మరేదైనా సమయంలో మౌత్ వాష్ వాడితే ఆశించిన ఫలితం ఒనగూడుతుందని అన్నారు. ఆమె నెటిజన్లకు పలు ప్రశ్నకు లైవ్‌లో సమాధానం ఇవ్వడంతో అనేక మంది ధన్యవాదాలు తెలిపారు.