Share News

Covishield Side Effects: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై వైద్యుల తీవ్ర ఆందోళన.. తయారీని ఆపేసినట్లు ప్రకటించిన ఆస్ట్రాజెనిక

ABN , Publish Date - May 10 , 2024 | 12:15 PM

కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనిక సంస్థ ప్రకటించింది. వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) కారణంగా అరుదైన థ్రాంబోసిస్ సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది.

Covishield Side Effects: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్‌పై వైద్యుల తీవ్ర ఆందోళన.. తయారీని ఆపేసినట్లు ప్రకటించిన ఆస్ట్రాజెనిక

ఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మార్కెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు ఆస్ట్రాజెనిక సంస్థ ప్రకటించింది. వాణిజ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్(TTS) కారణంగా అరుదైన థ్రాంబోసిస్ సహా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు కంపెనీ అంగీకరించింది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు ఏర్పడుతున్నాయని డాక్టర్లు గుర్తించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సైడ్ ఎఫెక్ట్స్‌ని నిర్ధారిస్తూ యూకే దేశ కోర్టులో పత్రాలను అందజేశారు. ఆ తరువాత ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్(Covishield Vaccine) వ్యాక్సిన్‌ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. అధిక సరఫరా వల్ల దీనికి డిమాండ్ తగ్గిందని, మున్ముందు ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరగదని వివరించింది.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం గతంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంతో ఆస్ట్రాజెనెకా ఒప్పందం కుదుర్చుకుంది. యూకేకి చెందిన ఓ ఫార్మా కంపెనీ సైతం కోవిషీల్డ్ తయారికి ఒప్పందం కుదుర్చుకుంది.


వైద్యుల హెచ్చరికలు..

ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనిక కోవిషీల్డ్‌తో రక్తం గడ్డకడుతుందని యూకే కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ భద్రతపై వైద్యుల బృందం గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అవేకెన్ ఇండియా మూవ్‌మెంట్ (AIM)బ్యానర్‌లో అన్ని కొవిడ్ వ్యాక్సిన్‌లను పరీక్షించాలని, వాటిపై పటిష్ట నిఘా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు.


యూకేకు చెందిన జామీ స్కాట్ అనే వ్యక్తి 2021లో కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. అప్పటినుంచి నిత్యం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వైద్య పరీక్షలు చేసిన తరువాత ఆయన శరీరంలో రక్తం గడ్డకడుతోందని డాక్టర్లు గుర్తించారు. టీకా వేయించినప్పటి నుంచే తనకు సదరు సమస్య వేధిస్తోందని వైద్యులను సంప్రదించారు.

వైద్య పరీక్షల్లో ఈ పరిస్థితికి టీకానే కారణమని తేలింది. అతను థ్రోంబోసైటోపెనియా, థ్రాంబోసిస్ అనే వ్యాధి బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో యునైటెడ్ కింగ్‌డమ్ కోర్టులో పిటిషన్ వేశాడు.

Prajval Revanna Scandal Case: రేవణ్ణ కేసులో ఊహించని ట్విస్ట్.. తనను బెదిరించి ఆరోపణలు చేయించారన్న మహిళ

Read Latest News and National News Click Here..

Updated Date - May 10 , 2024 | 12:16 PM