Share News

Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:03 PM

మంచినీరు బాగా తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందని అనుకోవడం తప్పుడు అభిప్రాయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూట్రెక్ట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని తమ తాజా అధ్యయనంలో ఆధారాలతో సహా రుజువు చేశారు.

Viral: ఉదయాన్నే నీరు తాగితే హ్యాంగోవర్ తొలగిపోతుందా? ఇందులో నిజమెంత?

ఇంటర్నెట్ డెస్క్: మద్యం తాగాక మరుసటి రోజు హ్యాంగోవర్ వదిలించుకునేందుకు మంచి నీరు తాగాలని చాలా మంది విశ్వసిస్తారు. ఈ నమ్మకంలో నిజానిజాలు తేల్చేందుకు జరిగిన ఓ అధ్యయనం ప్రస్తుతం సంచలనంగా మారింది. హ్యాంగోవర్ తొలగించడంలో మంచి నీరు అంతపెద్ద ప్రభావం ఏమీ చూపదని తాజాగా తేలింది (Hangover).

Cold Showers: ఉదయాన్నే చన్నీటి స్నానంతో లాభమా? నష్టమా?


నెదర్‌లాండ్స్‌కు చెందిన యూట్రెక్ట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఇందు కోసం ఈ అధ్యయనంలో పాల్గొనే వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపులోని సభ్యులు ఎప్పటిలాగే మద్యం తాగిన మరుసటి ఉదయం బాగా నీరు తాగారు. రెండో గ్రూపు వారు హ్యాంగోవర్‌తో సతమతమవుతున్నా నీరు తాగలేదు. కానీ, రెండు గ్రూపుల్లో హ్యాంగోవర్ తీవ్రత దాదాపు ఒకేలా ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు. నీరు బాగా తాగిన వారిలో దాహం, గొంతు తడారిపోవడం లాంటి లక్షణాలు తొలగిపోయినప్పటికీ, తలనొప్పి, కడుపులో తిప్పినట్టు ఉండటం వంటి హ్యాంగోవర్ లక్షణాలు అదే స్థాయిలో ఉన్నాయి. దీంతో, హ్యాంగోవర్‌పై మంచి నీటి ప్రభావం తక్కువని పరిశోధకులు తేల్చారు.

Health: తీరిక లేదని తరచూ తిండి మానేస్తే జరిగేది ఇదే.. జాగ్రత్త!

సాధారణంగా మద్యం తాగిన తరువాత శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అంటే, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో, డీహైడ్రేషన్ కారణంగా హ్యాంగోవర్ సమస్య వస్తోందని చాలా మంది భావిస్తారట. అయితే, ఇది తప్పని యూట్రెక్ట్ పరిశోధకులు తేల్చారు. హ్యాంగోవర్‌కు ప్రధాన కారణం డీహైడ్రేషన్ కాదని స్పష్టం చేశారు. మద్యపానంతో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ హ్యాంగోవర్‌కు దారి తీస్తాయి. వీటి కారణంగానే హ్యాంగోవర్ తలెత్తుతుందని చెబుతున్నారు.

Health: ఆఫీసులో పని ఒత్తిడి.. ఏడాదిలో 20 కిలోల బరువు పెరిగిన మహిళ!


వయసు పెరిగే కొద్దీ హ్యాంగోవర్ సమస్యలు ఎక్కువడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. వయసుతో పాటు కాలేయం పని తీరు మందగిస్తుందని కాబట్టి అది శరీరంలోని ఆల్కహాల్‌ను తొలగించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని చెప్పారు. ఫలితంగా హ్యాంగోవర్ ఎక్కువ సేపు వేధిస్తుందని అంటున్నారు. వైద్యులు చెప్పే దాని ప్రకారం, హ్యాంగోవర్ తొలగించుకునేందుకు ప్రస్తుతం చికిత్సలు ఏమీ లేవు. మద్యం జోలికి వెళ్లకుండా ఉండటమే ఈ సమస్యకు పరిష్కారం.

Insulin: ఇన్సులీన్ తీసుకునే పేషెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

Read Health and Latest

Updated Date - Sep 17 , 2024 | 09:10 PM