Drinking water: రోజూ 8 గ్లాసుల నీరు తాగడంలో లాజిక్ ఏంటి? తాగకపోతే జరిగేదేంటి?
ABN , Publish Date - Apr 04 , 2024 | 03:37 PM
ఆరోగ్య నిపుణులు ప్రతి రోజూ తీసుకోవలసిన నీటి గురించి కొన్ని లెక్కలు చెప్తారు. రోజూ 8 గ్లాసుల నీరు తీకుకోకుంటే ఏం జరుగుతుందంటే..
నీరు శరీరానికి గొప్ప ఇంధనం. రోజూ శరీరానికి సరిపడా నీరు తీసుకుంటే శరీరం, శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణులు ప్రతి రోజూ తీసుకోవలసిన నీటి గురించి కొన్ని లెక్కలు చెప్తారు. దీని ప్రకారం రోజూ 8 గ్లాసుల నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొందరు ఆరోగ్యం మీద స్పృహతో లెక్క పెట్టుకుని నీరు తాగుతుంటారు. కానీ మరికొందరు నీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. అసలు రోజూ 8 గ్లాసుల నీరు తాగడం వెనుక లాజిక్ ఏంటి? అలా తాగకపోతే ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే..
పరిశోధకుల ప్రకారం రోజుకు 8 గ్లాసుల నీరు తాగకపోతే మూత్రపిండాల్లో రాళ్ల ఏర్పడే సమస్య సాధారణం కంటే 20శాతం ఎక్కువ ఉంటుందని తెలిసింది. శరీరం నుండి విషాన్ని తొలగించడంలో నీరు మూత్రపిండాలకు సహాయపడుతుంది. ఈ కారణంగా మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలన్నా నీరు చాలా అవసరం.
ఇది కూడా చదవండి: ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?
నీరు తక్కువ తీసుకున్నప్పుడు మూత్రపిండాలలో లవణాలు పేరుకుపోయి అవి కాస్తా గట్టిగా మారి రాయిగా ఏర్పడతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. కిడ్నీలో స్టోన్ ఉన్నవారికి తీవ్రమైన కడుపునొప్పి, మూత్రవిసర్జన సమయంలో మంట, వాంతులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడితే దాని నుండి పరిష్కారానికి రోజూ 8 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచే ఆహారం తీసుకోవాలి. మద్యపానం అలవాటు ఉండే మానుకోవాలి. రోజూ వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.