Share News

Dry Skin: మీది పొడి చర్మమా? ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే చలికాలంలో సేఫ్..!

ABN , Publish Date - Oct 15 , 2024 | 06:14 PM

వాతావరణం మారగానే పొడి చర్మం ఉన్నవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారు ఆయుర్వేదం చెప్పిన ఈ చిట్కాలు పాటిస్తే..

Dry Skin: మీది పొడి చర్మమా? ఆయుర్వేదం చెప్పిన ఈ టిప్స్ పాటిస్తే చలికాలంలో సేఫ్..!
Dry Skin

వాతావరణం మారగానే మొదటగా దాని ప్రభావానికి లోనయ్యేది చర్మమే.. చర్మం లో కూడా రకాలు ఉన్నాయి. కొందరికి జిడ్డు చర్మం ఉంటుంది. మరికొందరికి సాధారణ చర్మం ఉంటుంది. ఇంకొందరికి పొడి చర్మం ఉంటుంది. మరికొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. ఇంకొందరికి మిక్స్డ్ స్కిన్ ఉంటుంది. చర్మం రకాన్ని బట్టి వారు సోప్ లు, ఫేస్ వాష్ లు, స్కిన్ ప్రోడక్ట్స్ వంటివి ఎంపిక చేసుకుంటూ ఉంటారు. చలికాలం రాగానే ఎక్కువగా ఇబ్బంది పడేది పొడి చర్మం ఉన్నవారే.. పొడి చర్మం ఉన్నవారికోసం ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Personality Test: మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట.. ఓసారి చెక్ చేసుకోండి..!


వేడి నీరు..

పొడి చర్మం ఉన్నవారు స్నానానికి లేదా ముఖం కడుక్కోవడానికి వేడి నీరు ఉపయోగించకూడదు. చాలామంది చలి కారణంగా బాగా వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తారు. కానీ వేడి నీరు చర్మాన్ని దెబ్బతీస్తుంది. చర్మంలో తేమను కోల్పోయేలా చేస్తుంది. వాతావరణం వల్ల డ్యామేజ్ అయిన చర్మాన్ని మరింత లోతుగా దెబ్బతీస్తుంది. అదే విధంగా ఎక్కువ రసాయనాలు ఉన్న సోప్ లను కూడా అవాయిడ్ చేయాలి.

మాయిశ్చరైజర్..

పొడి చర్మం ఉన్నవారు వాతావరణానికి చర్మం దెబ్బతినకుండా మాయిశ్చరైజర్ వాడుతూ ఉంటారు. అయితే మాయిశ్చరైజర్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయనాలు లేని మాయిశ్చరైజర్లు మాత్రమే కాదు.. కలబంద, బాదం నూనె, కొబ్బరినూనె వంటివి సహజంగా శరీరాన్ని మాయిశ్చరైజర్ చేస్తాయి. అంతేకాదు.. స్నానానికి ముందు నూనెతో మసాజ్ చేసుకున్నా చర్మం మృదువుగా ఉంటుంది.

Health Tips: మలబద్దకం వేధిస్తోందా? మజ్జిగలో ఈ 2 పదార్థాలు కలిపి తాగితే..!


హెల్తీ ఫ్యాట్స్..

ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బాదం, వాల్నట్స్, జీడిపప్పు వంటివే కాకుండా అవకాడో వంటివి కూడా చేర్చడం వల్ల చర్మం లోపలి నుండి ఆరోగ్యంగా ఉంటుంది.

నిమ్మకాయ నీరు..

శరీరాన్ని శుద్ది చేసి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో నిమ్మరసం నీరు బాగా సహాయపడుతుంది. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగితే జీర్ణక్రియ మెరుగవ్వడమే కాదు.. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.

మసాజ్..

నూనెతో శరీరం అంతా మసాజ్ చేసుకోవడం వల్ల పొడి చర్మం సమస్యలు తగ్గుతాయి. రోజు కుదరకపోయినా కనీసం వారానికి ఒకసారి శరీరం అంతా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను శరీరం అంతా పట్టించి అభ్యంగ స్నానం చేయాలి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి..

Cancer: పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. మహిళలే కాదు పురుషుల్లో కూడా..!

Hair Growth: ఇవి అలవాటు చేసుకుంటే చాలు.. పొడవాటి జుట్టు మీ సొంతమవుతుంది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 15 , 2024 | 06:14 PM