Kidney Cancer: కిడ్నీ క్యాన్సర్ బారినపడే ముందు శరీరంలో కనిపించే మార్పులు! అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
ABN , Publish Date - Mar 28 , 2024 | 04:17 PM
కిడ్నీ క్యాన్సర్‌కు ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే
ఇంటర్నెట్ డెస్క్: మహిళలు, పురుషులకు సాధారణంగా సోకే వ్యాధుల్లో కిడ్నీ క్యాన్సర్ కూడా ఒకటి. ప్రతి 43 మంది పురుషుల్లో ఒకరు తమ జీవితకాలంలో కిడ్నీ క్యాన్సర్ (Kidney Cancer) బారిన పడుతుండగా, ప్రతి 73 మంది మహిళల్లో ఒకరు ఈ వ్యాధి బారినపడుతున్నారు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే సంకేతాలను గుర్తిస్తే వ్యాధి ముదరకుండానే దీన్నుంచి బయటపడొచ్చు. కాబట్టి ఈ లక్షణాలపై (Early Symptoms) అవగాహన పెంచుకోవడం మంచిది.
Sugar Facts: చక్కెర గురించి ఎవరైనా ఇలా చెబితే అస్సలు నమ్మొద్దు!
మూత్రంలో రక్తం
తరచూ మూత్రంలో రక్తం పడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే, మూత్రంలో ఎప్పుడన్నా రక్తం పడినా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి
ఫ్లాంక్ పెయిన్
కడుపు పైభాగం, వెనక వైపు, పక్కల వచ్చే నొప్పిని ఫ్లాంక్ పెయిన్ అని అంటారు. కిడ్నీల్లో కణితి కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.
ఉదర భాగం ఉబ్బెత్తుగా మారడం
కిడ్నీల సైజు పెరిగితే పొట్టలో ఓవైపు ఉబ్బెత్తుగా మారొచ్చు. కాబట్టి, పొట్టలో ఏ భాగంలోనైనా ఉబ్బెత్తుగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
పారా నియోప్లాస్టిక్ సిండ్రోమ్
కిడ్నీల్లోని ట్యూమర్‌పై రోగ నిరోధక వ్యవస్థ అసాధారణ రీతిలో దాడి మొదలెట్టినప్పుడు కణితులు కొన్ని రకాల సబ్‌స్టెంన్సెస్‌ను విడుదల చేస్తాయి. ఇవి శరీరం అంతటా ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జ్వరం, ఆకలి లేకపోవడం, కాల్షియం స్థాయిలు పెరగడం, రక్తకణాల సంఖ్య తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
Wet Hair: తడిజుట్టుతోనే నిద్రపోతున్నారా? ఇలా అస్సలు చేయొద్దని నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే..!
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి