Share News

Summer Health: నిమ్మరసమా.. కొబ్బరి నీళ్లా.. వేసవిలో ఏది ప్రయోజనకరం..

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:57 PM

వేసవి ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాలులు చెమటలు పట్టిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. శ

Summer Health: నిమ్మరసమా.. కొబ్బరి నీళ్లా.. వేసవిలో ఏది ప్రయోజనకరం..

వేసవి ( Summer ) ఎండలు పెరిగిపోతున్నాయి. వడగాలులు చెమటలు పట్టిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో చాలా మంది డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీరంలోని నీరు, లవణాలు అన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి వాటి స్థానాన్ని మళ్లీ భర్తీ చేయాలి. లేకపోతే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ కారణంగా బాడీ డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు హెల్తీ డ్రింక్స్ ను తీసుకోవడం చాలా అవసరం. డీహైడ్రేటింగ్ డ్రింక్స్ అంటే ప్రజలకు ముందుగా నిమ్మరసం, కొబ్బరి నీరు గుర్తుకు వస్తాయి. శరీరాన్ని నిర్జలీకరణం నుంచి రక్షించేందుకు ఈ రెండు పానీయాలు ఎంతో ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిలో ఏది మంచిదనే అనుమానం సాధారణంగా అందరికీ వస్తుంది. దీనిపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.


Dubai: దుబాయ్‌లో వర్షానికి క్లౌడ్ సీడింగే కారణమా.. నిపుణులు ఏమంటున్నారంటే..

కొబ్బరి నీళ్లల్లో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడమే కాకుండా కండరాల నిర్మాణంలోనూ ఉపయోగపడతాయి. అదే నిమ్మరసం విషయానికి వస్తే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అంతే కాకుండా అనేక సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. నిమ్మకాయలో ఆల్కలీన్ గుణాలు అధికం. శరీరం pH స్థాయిని నిర్వహించడంలో మేలు చేస్తుంది.


Encounter Laxman: ఆ సమయంలో టీమ్ సహకారం చాలా అవసరం.. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ లక్ష్మణ్..

వేసవి కాలంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు నిమ్మరసం, కొబ్బరి నీరు రెండూ తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లు శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లోపాన్ని భర్తీ చేస్తే, నిమ్మరసంలోని విటమిన్ సి ఆక్సీకరణ ఒత్తిడిని తొలగిస్తుంది. కాబట్టి పరిగడుపునే కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. రోజంతా చురుగ్గా ఉండేందుకు నిమ్మరసాన్ని డైట్ లో భాగం చేసుకోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

మరిన్ని ఆరోగ్యం వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 18 , 2024 | 02:57 PM