Facial Hair: ఆడవాళ్ళ ముఖం మీద అవాంఛిత రోమాలు ఎందుకు వస్తాయి? దీన్ని ఈజీగా తొలగించే పద్దతులేవంటే..!
ABN , Publish Date - May 18 , 2024 | 04:57 PM
ఆడవాళ్లకు ముఖం మీద జుట్టు పెరిగితే చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. దీన్ని తొలగించడానికి పార్లర్‌లో వ్యాక్సింగ్ లేదా లేజర్ చికిత్స తీసుకుంటారు. ఈ చికిత్సలన్నీ తాత్కాలికమే.. వాటి ప్రభావం 15 నుండి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ముఖంపై జుట్టు కనిపించడం మొదలవుతుంది.
మగవాళ్లకు ముఖం మీద వెంట్రుకలు పెరిగినా.. ముఖ్యంగా పై పెదవి పై భాగాన పెరిగినా వారికి అది సాధారణం అనుకుంటారు. కానీ అదే విధంగా ఆడవాళ్లకు పెరిగితే మాత్రం చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. దీన్ని తొలగించడానికి పార్లర్‌లో వ్యాక్సింగ్ లేదా లేజర్ చికిత్స తీసుకుంటారు. ఈ చికిత్సలన్నీ తాత్కాలికమే.. వాటి ప్రభావం 15 నుండి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ముఖంపై జుట్టు కనిపించడం మొదలవుతుంది. అయితే మహిళల ముఖంపై జుట్టు ఎందుకు పెరుగుతుందో.. దాన్ని ఎలా తొలగీంచుకోవాలో తెలుసుకుంటే ముఖం మీద అవాంఛిత రోమాల గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు.
కారణాలు..
అధిక ఇన్సులిన్ స్థాయిలు అండాశయాలను భారంగా మారుస్తాయి. ఇది మరింత టెస్టోస్టెరాన్ ఉత్పత్తికి దారితీస్తుంది.దీనిని సాధారణంగా PCOS అంటారు.
కొబ్బరి నీళ్లు ఎవరు తాగకూడదు? మీకు తెలియని నిజాలివీ..!
జన్యుపరంగా, మహిళలు ఎక్కువ ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే ధోరణిని కలిగి ఉంటారు. ఈ కారణం వల్ల కూడా అవాంఛిత రోమాలు వస్తాయి.
ఒత్తిడి కారణంగా, అడ్రినల్స్ నుండి DHEAS (డీహైడ్రోపియాండ్రోస్టెరాన్ సల్ఫేట్) అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది కూడా అవాంఛిత రోమాలకు కారణం.
తక్కువ SHBG స్థాయిలు మహిళల్లో టెస్టోస్టెరాన్, DHTని పెంచుతాయి. సింథటిక్ ప్రొజెస్టెరాన్ (OCP), స్టెరాయిడ్స్ లేదా హైపో థైరాయిడిజం లేదా అడ్రినల్ ఎగ్జాస్షన్ తీసుకున్నప్పుడు తక్కువ స్థాయిలు సంభవించవచ్చు.
మీ జీవక్రియ బలంగానే ఉందా? ఈ 6 విషయాలు గమనిస్తే సరి..!
పరిష్కారాలు..
ఇన్సులిన్‌ను మెరుగుపరచడానికి దాల్చినచెక్క, గ్రీన్ టీ, ఒమేగా 3, D3, తక్కువ GI, తక్కువ పిండి, తక్కువ కార్బ్, మంచి కొవ్వు ఆహారం, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
జింక్ సప్లిమెంట్‌ను లేదా జింక్ ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి.
రోజుకు రెండుసార్లు పుదీనా టీ తీసుకోవాలి.
సింథటిక్ హార్మోన్లను నివారించాలి.
లేజర్ చికిత్స కొంతవరకు ముఖ వెంట్రుకలను నియంత్రిస్తుంది. కానీ అవాంఛిత రోమాలకు మూలకారణం తెలుసుకుని వాటిని సమూలంగా నియంత్రించుకోవాలి.
ఈ టీలు తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చట..!
మీ జీవక్రియ బలంగానే ఉందా? ఈ 6 విషయాలు గమనిస్తే సరి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.