Share News

Figs: వేసవిలో అంజీర్ పండ్లు తినడం ఆరోగ్యమేనా? వైద్యులు చెప్పిన నిజాలివీ..!

ABN , Publish Date - Mar 27 , 2024 | 04:26 PM

వేసవి కాలంలో అంజీర్ పండ్లు ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు? వైద్యులేం చెప్పారంటే..

Figs:  వేసవిలో అంజీర్ పండ్లు తినడం ఆరోగ్యమేనా?  వైద్యులు చెప్పిన నిజాలివీ..!

అంజీర్ ఒక డ్రై ఫ్రూట్. ఇది ఆరోగ్యాన్ని అనేక విధాలుగా మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్, ఐరన్ వంటి పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే వేసవికాలంలో మాత్రం అంజీర్ పండ్లు తినే విషయంలో పెద్ద సందిగ్ధం నెలకొంది. దీనికి కారణం అంజీర్ పండ్లు వేడి స్వభావం కలిగి ఉంటాయి. వీటిని తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వేసవి కాలంలో అంజీర్ పండ్లు ఎవరు తినవచ్చు? ఎవరు తినకూడదు? మొదలైన విషయాలు తెలుసుకుంటే..

ఆస్తమా రోగులు..

అత్తిపండ్లు లేదా అంజీర్ పండ్లు అధికంగా తీసుకోవడం వల్ల కండ్ల కలక, రినిటిస్, అనాఫిలాక్టిక్ షాక్ లు వస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆస్తమాతో బాధపడేవారు అంజీర్ పండ్లు తినకూడదు.

ఇది కూాడా చదవండి: భారతదేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేసిన 9మంది వ్యాపారవేత్తలు వీళ్లే..!


కాలేయం..

అత్తిపండ్లలో ఉండే గింజలు కాలేయం మీద చెడు ప్రభావం చూపిస్తాయి. ఇవి కాలేయానికి హాని కలిగిస్తాయి. అత్తి పండ్లలో ఉండే విత్తనాల ప్రభావం వెంటనే కనిపించకపోయినా కొన్ని గంటల తరువాత వాటి ప్రభావం ఉంటుంది.

కడుపు సమస్యలు..

అత్తి పండ్లను ఎక్కువ తీసుకోవడం వల్ల కడుపులో చికాకు, వాపు వంటి సమస్యలు రావచ్చు.

ఉష్ణోగ్రత..

ఆహారంలో అత్తిపండ్లను చేర్చుకునేటప్పుడు వాటి బెనిఫిట్స్ ఏ కాదు.. వాటి దుష్ప్రభావాలు కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఉష్ట్రోగ్రత 40డిగ్రీలు దాటినప్పుడు వీటిని తినకూడదు.

చలికాలంలో..

చలికాలంలో అత్తిపండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినకుండా నియంత్రిస్తుంది. అయితే బరువు తగ్గాలని అనుకునేవారు దీన్ని ఎక్కువ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి.

అంజీర్ పండ్లను పాలలో వేసి మరిగించి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులతో పోరాడే సామర్థ్యం మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్య కూడా పరిష్కారమవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 27 , 2024 | 04:26 PM