Share News

High Protien: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:57 PM

అతి అన్నింటా అనర్థదాయకమే. కొందరు జిమ్ము, డైట్ల పేరుతో ఎక్కువ మోతాదులో ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని తింటున్నారు. ఇటువంటి అలవాటు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడటం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.

High Protien: ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
High protien

మనిషి ఆరోగ్యానికి ప్రోటీన్ ఎంతో మేలు చేస్తుంది. కానీ, మోతాదు మించితే రక్తంలో కలిసే ప్రొటీన్ విషంగా మారుతుంది. అందుకే మనిషి బరువును బట్టి అవసరమైన ప్రొటీన్ ను లెక్కగట్టి తీసుకోవాలంటున్నారు నిపుణులు. కిలో శరీరబరువుకు 0.8 గ్రాముల ప్రొటీన్ మాత్రమే అవసరం. కాబట్టి మీ బరువును బట్టి మీకెంత ప్రొటీన్ అవసరమో లెక్క వేసుకోవచ్చు. బరువు తగ్గేందుకు, కండరాల నిర్మాణానికి, కణాల రిపేర్ చేయడానికి ప్రొటీన్ చాలా అవసరం. అయితే ప్రొటీన్ అధికంగా ఆహారాన్ని అపరిమితంగా తింటే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి.


దాహం పెరుగుతుంది

శరీరంలో ప్రొటీన్ ఎక్కువైతే శరీరం నీరసించి పోతుంది. తీవ్రమైన దాహం కలుగుతుంది. ఎందుకంటే.. అధిక ప్రొటీన్ వల్ల శరీరానికి ఎక్కువ నీరు కావాల్సి వస్తుంది. దాని వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీనికి కారణం ప్రొటీన్లో ఉండే నత్రజని. ఇది అధికంగా రక్తంలో చేరడం వల్ల ఇలాంటి మార్పులు కలుగుతాయి. దీని వల్ల మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. వ్యర్థాలను బయటకు పంపేందుకు అధికంగా కష్టపడాల్సి వస్తుంది. ఎంత నీరు తాగిన శరీరానికి సరిపోదు. దీనివల్ల శరీరం బలహీనంగా మారిపోతుంది. తలనొప్పి ఎక్కువైపోతుంది. బరువు తగ్గి సన్నగా మారిపోతారు.


నోటి దుర్వాసన దీని లక్షణమే..

చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతుంటారు. ఇందుకు ఆహారంలో అధిక ప్రొటీన్ కూడా కారణమేనంటున్నారు. ప్రొటీన్లో ఉండే రెండు ఆమ్లాల తీవ్రమైన దుర్గంధాన్ని కలిగిస్తాయి. ఇందుకోసం కూడా అధికంగా నీళ్లు తాగాల్సి వస్తుంది.


మలబద్ధకం

ప్రొటీన్ శరీరంలో అధికమైతే మలబద్ధకం సమస్య కూడా ఎక్కువవుతుంది. కార్బోహైడ్రేట్లు తగ్గి, ప్రొటీన్ పెరిగితే మాత్రం ఈ సమస్య మరీ తీవ్రంగా మారుతుంది. ప్రొటీన్ ఉండే ఆహారం అధికంగా తిన్నామనిపిస్తే, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని అధికంగా తినాలి.


ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాలు...

కొన్ని ఆహారాల్లో ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది. మటన్, చికెన్, గుడ్లు , చేపలు, రొయ్యలు, పాలు, పెరుగు, చీజ్, నట్స్ (బాదం, జీడిపప్పు,వాల్నట్స్, గుమ్మడి గింజలు, నువ్వులు, సన్ ఫ్లవర్ గింజలు, టోఫు, అన్ని రకాల బీన్స్, శెనగలు... వీటన్నింటిలో ప్రొటీన్ ఉంటుంది.


ఒంటి నొప్పులు..

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలో వేడిని కలిగిస్తాయి. ఉదాహరణకు చికెన్, గుడ్లు, రొయ్యలు వంటివి. వీటిని మోతాదుకు మించి తీస్కుంటే ఒంటి నొప్పులు వేధిస్తాయి.

Updated Date - Nov 09 , 2024 | 06:57 PM