Health: మెదడుకు చేటు చేసే ఫుడ్స్.. వీటి జోలికెళ్లొద్దు!
ABN , Publish Date - May 24 , 2024 | 10:03 PM
ప్రాసెస్డ్ ఫుడ్స్, మద్యం, షుగరీ డ్రింక్స్ వంటివి అతిగా తీసుకుంటే మెదడు ఆరోగ్యం చెడి చివర్లో ఆల్జైమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనిషి శరీరంలోని అవయవాల్లో అత్యంత కీలకమైనది మెదడు. ఇతర అవయవాల పనితీరును కూడా కొంత వరకూ మెదడే నిర్దేశిస్తుంది. ఇంతటి కీలకమైన మెదడు విషయంలో చాలా మందికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియదు. దీంతో, జ్ఞాపకశక్తి తగ్గుదల, మూడ్స్ లో మార్పులు, మతిమరుపు, ఆల్జైమర్స్ వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. కాబట్టి, మెదడుకు (Health) మేలు చేసే ఆహారాలు ఏవో తెలుసుకుని (Foods Harmful for Brain) ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవాలి.
AC Sideeffects: నిరంతరం ఏసీ గదుల్లో గడిపే వారికి వచ్చే సమస్యలేంటో తెలుసా?
ప్రాసెస్డ్ ఫుడ్స్
చక్కెర, ఉప్పు, కొవ్వులు అధికంగా ఉండే చిప్స్, నూడుల్స్, పాప్‌కార్న్ వంటి ప్రాసెస్డ్ ఆహారాలతో బరువు పెరిగి మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. అవయవాల చుట్టూ పేరుకునే విసెరల్ కొవ్వు కారణంగా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది.
మద్యం
మద్యంతో అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మద్యంతో మెదడు పరిమాణం తగ్గడం, జీవక్రియల్లో మార్పులు, న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరులో ఆటంకాలు తలెత్తి చివరకు మెదడు పనితీరు సన్నగిల్లుతుంది.
షుగరీ డ్రింక్స్
చక్కెరలు అధికంగా ఉన్న జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్ కారణంగా అల్జైమర్స్ వ్యాధి తలెత్తే అవకాశం ఉంది. దీంతో, డిమెన్షియా అంటే మతిమరుపు బారిన కూడా పడొచ్చు.
మెర్క్యురీతో జాగ్రత్త
మెర్క్యురీ (పాదరసం) తో మెదడుకు చేటు కలుగుతుంది. కాబట్టి, పాదరసంతో కలుషితమైన చేపలు తినడం వల్ల బ్రెయిన్, లివర్, కిడ్నీలు పాడవుతాయి. ఇలాంటి ఆహారంతో కడుపుతో ఉన్న మహిళలకూ ప్రమాదమే.
రిఫైన్డ్ చక్కెరలు అధికంగా ఉన్న మైదాపిండితో రక్తంలో చక్కెర, ఇన్సులీన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మార్పులు మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.
ట్రాన్స్ కొవ్వులు కూడా మెదడుకు చేటు చేస్తాయి. వీటిని అధికంగా తింటే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఆల్జైమర్స్, డిమెన్షియా బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.