Gas Problem: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే నిమిషాలలో తగ్గిపోతుంది..!
ABN , Publish Date - Sep 13 , 2024 | 12:43 PM
నేటికాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం, ఏమీ తినాలని అనిపించక పోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.
నేటికాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది కడుపులో గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ సమస్య కారణంగా కడుపు ఉబ్బరం, ఏమీ తినాలని అనిపించక పోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. గ్యాస్ సమస్యను నిమిషాల్లో తగ్గించుకోవాలన్నా, గ్యాస్ సమస్య శ్వాశతంగా తగ్గాలన్నా ఈ కింది చిట్కాలు బాగా సహాయపడతాయి.
కడుపులో గ్యాస్ ఉత్పత్తి తగ్గడానికి, గ్యాస్ నుండి ఉపశమనం పొందడానికి ఆహారంలో తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవాలి.
Health Tips: గోరు వెచ్చని నీళ్లలో నెయ్యి కలిపి తాగితే కలిగే లాభాలు తెలుసా?
ప్రతిరోజూ ఉదయాన్నే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట శుభ్రంగా ఉండి గ్యాస్ నుండి ఉపశమనం లభిస్తుంది. వేడి నీరు పేగులను శుభ్ర పరుస్తాయి. కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఉదయాన్నే బద్దకంగా ఉండకుండా వ్యాయామం లేదా వాకింగ్, యోగా వంటివి చేయాలి. దీని వల్ల కడుపులో గ్యాస్ ఉత్పత్తి తగ్గుతుంది. కడుపులో గ్యాస్ సమస్య నిశ్చల జీవనశైలి వల్ల ఎక్కువగా వస్తుంది.
కొందరు ఆహారం తినేటప్పుడు చాలా తొందరగా తింటారు. ఏవో కొంపలు అంటుకుంటున్నట్టు ఆహారాన్ని సరిగ్గా నమలకుండా హడావిడిగా తింటారు. మరికొందరు ఆహారం తినేటప్పుడు టీవి, ఫోన్ వంటివి చూస్తూ తింటారు. దీనివల్ల ఆహారం సరిగా నమలకపోవడం, అతిగా తినడం జరుగుతుంది. ఇది గ్యాస్ సమస్యకు కారణం అవుతుంది. అందుకే ఆహారం తినేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
Peanuts: స్నాక్స్ గా వేరుశనగలు తింటే ఏం జరుగుతుంది? మీకు తెలియని నిజాలివి..!
ఆహారం జీర్ణం కావడానికి చేసే ప్రయత్నాలు కూడా గ్యాస్ సమస్యను తగ్గించగలవు. రాత్రి భోజనం చేసిన తరువాత కొద్దిసేపు వజ్రాసనం వేయాలి. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం కావడంలో సహాయపడుతుంది.
కడుపులో గ్యాస్ కు కారణం అయ్యే సోడా, శీతల పానీయాలు తాగడం మానుకోవాలి. ఇవి గ్యాస్ సమస్య మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. అలాగే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా జీవక్రియకు హాని కలుగుతుంది.
కొంతమంది మిగిలిపోయిన ఆహారాన్ని పడెయ్యలేక దాచుకుని మరుసటి రోజు తింటూంటారు. ఇలాంటి ఆహారంలో చాలా వరకు రసాయన మార్పులు ఉంటాయి. వీటిని తినడం వల్ల పేగు ఆరోగ్యం, పొట్ట ఆరోగ్యం దెబ్బతింటుంది.
రోజుకు కనీసం 2 నుండి 3 లీటర్ల నీరు తాగాలి. ఇది ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. పొట్ట శుభ్రంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
Belly Fat: ఉదయాన్నే ఈ పానీయాలలో ఏ ఒక్కటి తాగుతున్నా చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!
పియర్ పండ్లు తింటే.. ఈ సమస్యలన్నీ నయమవుతాయట..!
ఈ 7 తప్పులు చేస్తే తొందరగా ముసలి వాళ్ళు అవుతారు.. !
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.