Share News

Glowing Skin: మెరిసే చర్మం కావాలా? బయోటిన్ అధికంగా ఉన్న ఈ 7 ఆహారాలు తినండి చాలు..!

ABN , Publish Date - May 06 , 2024 | 12:36 PM

బయోటిన్ లోపం అరుదుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది పొడి, పొలుసుల చర్మం, పెళుసుగా ఉండే గోర్లు, జుట్టు రాలడం వంటి లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. చాలా మంది బయోటిన్ సప్లిమెంట్లను తీసుకుంటుంటారు. అయితే బయోటిన్ ను సహజంగా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.

Glowing Skin: మెరిసే చర్మం కావాలా? బయోటిన్ అధికంగా ఉన్న ఈ 7 ఆహారాలు తినండి చాలు..!

బయోటిన్.. దీన్ని విటమిన్ B7 లేదా విటమిన్ H అని కూడా పిలుస్తారు. ఇది నీటిలో కరిగే B-కాంప్లెక్స్ విటమిన్. ఆరోగ్యకరమైన చర్మ కణాలకు అవసరమైన కొవ్వు ఆమ్లాల సంశ్లేషణలో దీని పాత్ర ప్రముఖమైనది. ఈ కారణంగా ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కెరాటిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. జుట్టు గోళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. బయోటిన్ లోపం అరుదుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది పొడి, పొలుసుల చర్మం, పెళుసుగా ఉండే గోర్లు, జుట్టు రాలడం వంటి లక్షణాల ద్వారా బయటపడుతూ ఉంటుంది. చాలా మంది బయోటిన్ సప్లిమెంట్లను తీసుకుంటుంటారు. అయితే బయోటిన్ ను సహజంగా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. పెద్దలకు ప్రతి రోజూ 30-100మైక్రో గ్రాముల బయోటిన్ అవసరం. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు 30మైక్రోగ్రాములు సరిపోతుంది. బయోటిన్ అధికంగా ఉన్న ఆహారాలేంటో తెలుసుకుంటే..

గింజలు విత్తనాలలో బయోటిన్ ఉంటుంది. ముఖ్యంగా వాల్నట్, వేరుశనగ, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, అవిసె గింజలలో బయోటిన్ బాగుంటుంది.

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!


చిలకడదుంపలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కెరోటినాయిడ్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చిలకడదుంపలను ఎలా తీసుకున్నా మంచిదే.

గుడ్లలో ప్రోటీన్, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. పచ్చసొనలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. సాల్మొనెల్లా వల్ల నష్టం జరగకుండా ఉండటానికి, బయోటిన్ శోషణను మెరుగుపరచడానికి గుడ్లు ఎప్పుడూ పూర్తిగా ఉడకబెట్టాలి. గుడ్డులోని తెల్లసొనలో అవిడిన్ అని పిలువబడే ప్రోటీన్ ఉంటుంది. గుడ్డును పచ్చిగా తింటే అందులో ఉండే బయోటిన్ శోషణను ఈ అవిడిన్ అనే ప్రోటీన్ అడ్డుకుంటుంది.

సాల్మన్ సహా ఇతర ఫ్యాటీ ఫిష్ లలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఇందులో విటమిన్-బి అధ్బుతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన లిపిడ్లు కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్యమైన చర్మానికి సహాయపడుతుంది.

ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!


పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లతో పాటూ సెలీనియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ప్రతి కప్పు తాజా పుట్టగొడుగులలో 5.6 మైక్రోగ్రాముల బయోటిన్ ఉంటుంది.

అవోకాడో లో కూడా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంచుకోవాలని అనుకునేవారు బయోటిన్ అవోకాడోను తింటే మంచిది.

మాంసకృత్తులు, ఫైబర్, ఖనిజాలు చిక్కుళ్ళలో అధికంగా ఉంటాయి. బఠానీలు, బీన్స్, కాయధాన్యాలు, వేరుశనగలు, సోయాబీన్ లలో బయోటిన్ బాగుంటుంది.

గుండెపోటు రావడానికి ముందు కనిపించే లక్షణాలు ఇవే..!

ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 06 , 2024 | 12:36 PM