Good Sleep: పడుకునేముందు ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు.. హాయిగా నిద్ర పడుతుంది..!
ABN , Publish Date - Sep 19 , 2024 | 12:22 PM
పడుకోగానే కేవలం నిమిషాల మీద గాఢమైన నిద్రలోకి వెళ్లేవారు కొందరుంటారు. ఇలా నిద్రపోయేవారిని అదృష్టవంతులని చెప్పవచ్చు. కానీ కొందరికి మాత్రం ఏం చేసినా నిద్ర పట్టదు.
నిద్ర దివ్యమైన ఔషధం అని అంటారు. పడుకోగానే కేవలం నిమిషాల మీద గాఢమైన నిద్రలోకి వెళ్లేవారు కొందరుంటారు. ఇలా నిద్రపోయేవారిని అదృష్టవంతులని చెప్పవచ్చు. కానీ కొందరికి మాత్రం ఏం చేసినా నిద్ర పట్టదు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. పడుకునే ముందు కొన్ని పనులు చేయడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. అవేంటో తెలుసుకుంటే..
ఫిక్స్ చేసుకోవాలి..
నిద్ర బాగా పట్టాలి అంటే ఒక సమయాన్ని నిర్దేశించుకోవాలి. పడుకోవడానికి, లేవడానికి ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించుకుంటే సమయానికి పడుకోగానే నిద్ర వస్తుంది.
రోజూ ఒక స్పూన్ నువ్వులు తింటే ఈ సమస్యలు ఉన్నవారికి భలే లాభాలు..!
స్క్రీన్ టైం..
నిద్రకు ఆటంకం కలిగించే వాటిలో స్క్రీన్ అతి పెద్ది. టీవి, ల్యాప్టాప్, ఫోన్ ఇలా ఏదైనా సరే పడుకునేవరకు చూడకూడదు. వీటి నుండి వెలువడే నీలి రంగు కాంతి నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. నిద్ర పోవడానికి కనీసం గంట ముందు వీటిని బంద్ చేయాలి.
ఆహారం..
రాత్రి సమయంలో తీసుకునే భోజనం ఎప్పుడూ తేలికగా సులువుగా జీర్ణమయ్యే విధంగా ఉండాలి. అలాగే నిద్రకు కనీసం గంట లేదా రెండు గంటల ముందే ఆహారం తీసుకోవాలి. ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. భారీగా ఉన్న ఆహారం తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం, అజీర్తి, కడుపులో యాసిడ్లు ఏర్పడటం వంటి సమస్యలు వస్తాయి.
ధ్యానం లేదా ప్రాణాయామం..
కుదిరితే నిద్రపోవడానికి ముందు ధ్యానం లేదా ప్రాణాయామం చేయాలి. ఇది ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకుని వస్తుంది. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది.
మీకు స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? అయితే మీరు లక్కీ..!
పాలు..
నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం చాలా మంది అలవాటు. పాలలో ఉండే ట్రిప్టోపాన్ అనే అమినో యాసిడ్ శరీరంలో మెలటోనిన్ స్థాయిని పెంచుతుంది.
వాతావరణం..
నిద్ర బాగా పట్టాలంటే పడుకునే ప్రదేశం కూడా బాగుండాలి. నిద్రపోయే ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉండాలి. గదిలో పెద్ద శబ్దంతో పాటలు, నిద్రకు భంగం కలిగించే వాతావరణాన్ని నివారించాలి.
కివి పండును ఎవరు తింటే మంచిదో తెలుసా?
తక్కువగా నిద్రపోతే చర్మం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.